HDFC Scholarship: పై చదువుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్... దరఖాస్తు ఇలా

HDFC Educational Crisis Scholarship Support | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ 2019 పేరుతో ఆర్థికంగా సపోర్ట్ ఇస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్న విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్ ఇది.

news18-telugu
Updated: June 14, 2019, 4:37 PM IST
HDFC Scholarship: పై చదువుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్... దరఖాస్తు ఇలా
HDFC Scholarship: పై చదువుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్... దరఖాస్తు ఇలా (Photo Credit: Getty Images)
news18-telugu
Updated: June 14, 2019, 4:37 PM IST
ఉన్నత విద్య... పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుతోంది. మంచి విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిభ ఉన్నా డబ్బులు లేక ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులెందరో. వారికోసమే అనేక సంస్థలు ఆర్థికంగా చేయూతనిస్తుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ 2019 పేరుతో ఆర్థికంగా సపోర్ట్ ఇస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్న విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్ ఇది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్కాలర్‌షిప్‌ పొందాలంటే అర్హతలేంటీ? తెలుసుకోండి.

Read this: Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

HDFC scholarship, scholarship for students, hdfc scholarship 2019, HDFC Educational Crisis Scholarship Support, Scholarship applications, degree Scholarship, inter Scholarship, pg Scholarship, phd Scholarship, హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్, హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్ 2019, స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, డిగ్రీ స్కాలర్‌షిప్, ఇంటర్ స్కాలర్‌షిప్, పీజీ స్కాలర్‌షిప్, పీహెచ్‌డీ స్కాలర్‌షిప్
ప్రతీకాత్మక చిత్రం


HDFC Scholarship: హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హతలివే...




ప్రైవేట్, గవర్నమెంట్, గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులూ అర్హులే. టెన్త్, ఇంటర్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా లాంటి టెక్నికల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా స్కాలర్‌షిప్ పొందొచ్చు. గత మూడేళ్లుగా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేనివాళ్లు, ఆర్థిక సమస్యలతో చదువును కొనసాగించలేకపోతున్నవారికే స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కూల్ విద్యార్థులకు వార్షిక ఫీజు లేదా రూ.10,000, డిగ్రీ, పీజీ, టెక్నికల్ కోర్స్ విద్యార్థులకు రూ.25,000 లేదా వార్షిక ఫీజు ఇందులో ఏది తక్కువైతే అంత స్కాలర్‌షిప్‌గా ఇస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో స్కాలర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

Read this: Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

HDFC scholarship, scholarship for students, hdfc scholarship 2019, HDFC Educational Crisis Scholarship Support, Scholarship applications, degree Scholarship, inter Scholarship, pg Scholarship, phd Scholarship, హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్, హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్ 2019, స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, డిగ్రీ స్కాలర్‌షిప్, ఇంటర్ స్కాలర్‌షిప్, పీజీ స్కాలర్‌షిప్, పీహెచ్‌డీ స్కాలర్‌షిప్
ప్రతీకాత్మక చిత్రం
Loading...

HDFC Scholarship: విద్యార్థులను ఎంపిక చేసేది ఇలాగే...


స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి కుటుంబం మూడేళ్ల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తారు. సంపాదిస్తున్న కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా, తీవ్ర అనారోగ్యం కారణంగా ఉద్యోగం కోల్పోయినా, పిల్లలు అనాథలైనా, స్వయం ఉపాధితో నష్టపోయినా, కుటుంబ సభ్యులు తీవ్రమైన జబ్బులతో చికిత్స పొందుతున్నా ఆ కుటుంబానికి చెందిన విద్యార్థుల్ని స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ 2019 కోసం దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్‌ఐసీ పాలసీ మీ కోసమే...

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

 
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...