Scholarships: విద్యార్థులకు ఆ బ్యాంక్ స్కాలర్​షిప్ ల ప్రకటన.. దీనికి ఎవరు అర్హులంటే..

ప్రతీకాత్మక చిత్రం (Image credit : shutterstock)

దేశవ్యాప్తంగా 3,500 మందికి పైగా పిల్లలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయారు. అదనంగా దాదాపు 26,000 మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవర?

  • Share this:
ఏడాదిన్న కాలం నుంచి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. నేషనల్​ కమిషన్​ ఫర్​ చైల్డ్​ రైట్స్​ ప్రకారం, దేశవ్యాప్తంగా 3,500 మందికి పైగా పిల్లలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయారు. అదనంగా దాదాపు 26,000 మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయారు. ఈ పిల్లల చదువు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి విద్యార్థుల కోసం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ పేరుతో స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా పరివర్తన్​ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ స్కాలర్​షిప్​ పొందేందుకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఎంపిక చేస్తారు? వంటి వివరాలు చూద్దాం.

ఎవరెవరు దరఖాస్తుకు అర్హులు?
ఈ స్కాలర్‌షిప్​ను పాఠశాల (1 నుంచి 12 తరగతుల వరకు), కళాశాల (అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా) విద్యార్థుల కోసం రూపొందించింది. స్కాలర్‌షిప్​కు ఎంపికైన విద్యార్థులకు రూ .15 వేల నుంచి రూ .75 వేల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తుంది. స్కాలర్‌షిప్ ఫండ్‌ను ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఆన్‌లైన్ లెర్నింగ్ పరికరాలు, పుస్తకాల మొదలైన వాటి కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఇక అర్హతల విషయానికి వస్తే.. 2020 జనవరి నుండి కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, వారి కుటుంబ వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 6 లక్షలకు మించకూడదు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుంది. బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌తో లాగిన్​ అవ్వాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన డాక్యుమెంట్స్​ సమర్పించాలి. గతేడాది మార్క్​ షీట్​​, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, అడ్మిషన్​ లెటర్​, ఫీజు రిసిప్ట్ లేదా స్కూల్​, కాలేజీ ఐడీ కార్డు, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, ఉద్యోగం కోల్పోయినట్లయితే, తల్లిదండ్రులు మునుపటి ఉపాధికి రుజువు, వారి బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబం ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పాఠశాల ఉపాధ్యాయుడు, వైద్యుడు మొదలైనవారి నుంచి రిఫరెన్స్​ లెటర్​ వంటి డాక్యుమెంట్లు ఆన్​లైన్​లో సమర్పించాలి.

ఎలా ఎంపిక చేస్తారు?
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్​కు ఎంపిక ప్రక్రియ బహుళ దశల్లో ఉంటుంది. గతేడాది మార్కులు, కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అయితే, ఈ స్కాలర్​షిప్​ను ఒకేసారి మంజూరు చేస్తారు. తర్వాతి సంవత్సరాలకు దీన్ని కొనసాగించరు.
Published by:Veera Babu
First published: