HCL Jobs: ఇంటర్, డిగ్రీ పాసైతే 3000 ఉద్యోగాలు... జూలై 6, 7న రిక్రూట్‌మెంట్ డ్రైవ్

HCL Technologies Mega Recruitment Drive | ఎంపికైన అభ్యర్థులకు మొదట టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫ్ సర్వీసెస్ శిక్షణ ఇస్తుంది.

news18-telugu
Updated: July 4, 2019, 12:41 PM IST
HCL Jobs: ఇంటర్, డిగ్రీ పాసైతే 3000 ఉద్యోగాలు... జూలై 6, 7న రిక్రూట్‌మెంట్ డ్రైవ్
HCL Jobs: ఇంటర్, డిగ్రీ పాసైతే 3000 ఉద్యోగాలు... జూలై 6, 7న రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 4, 2019, 12:41 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది. నోయిడా క్యాంపస్‌లో జూలై 6, 7 తేదీల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అప్లికేషన్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఐటీ మెయింటనెన్స్, సపోర్ట్‌ విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించనుంది హెచ్‌సీఎల్. ఇంజనీర్, నాన్-ఇంజనీర్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి 2,000 ఉద్యోగాలు, ఇంటర్ పాసైన వారికి 1,000 ఉద్యోగాలను కేటాయించింది. ఇంటర్ పాసైన వారిని హెచ్‌సీఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అయిన 'టెక్ బీ' కోసం రిక్రూట్ చేసుకోనుంది. రాష్ట్ర బోర్డుల నుంచి ఇంటర్ పాసైనవాళ్లు లేదా సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లో 12వ తరగతి చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునే ఫ్రెషర్స్‌కి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మంచి అవకాశాన్ని అందిస్తోందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా అన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు మొదట టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫ్ సర్వీసెస్ శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం ఫీజు చెల్లించాలి. శిక్షణ పూర్తైన తర్వాత కంపెనీలో ఉద్యోగులుగా నియమించుకుంటుంది హెచ్‌సీఎల్. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2018లో ఇలాంటి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి 5,800 మందికి అవకాశం కల్పించింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు
Loading...
Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

IT Jobs: త్వరలో ఐటీ సెక్టార్‌లో 2,50,000 కొత్త ఉద్యోగాలు
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...