Home /News /jobs /

HCL TECHNOLOGIES ORGANISING VIRTUAL MEGA RECRUITMENT DRIVE IN NAGPUR ON 2020 AUGUST 29 AND 30 SS

HCL Jobs: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 800 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

HCL Jobs: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 800 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

HCL Jobs: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 800 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

HCL Technologies mega recruitment drive | సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వివరాలు తెలుసుకోండి.

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మెగా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. నాగ్‌పూర్‌లోని మిహాన్ క్యాంపస్‌లో 800 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆగస్ట్ 29, 30 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆగస్ట్ 29, 30 తేదీల్లో వర్చువల్ డ్రైవ్ సెషన్ ఉంటుంది. అయితే నాగ్‌పూర్‌లోని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పని చేయాలనుకునేవారు దరఖాస్తు చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, అప్లికేషన్ సర్వీసెస్, ఇంజనీరింగ్, రీసెర్చ్ సర్వీసెస్, డిజిటల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ లాంటి విభాగాల్లో 3 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

    Job Loss: ఉద్యోగం పోయిందా? 15 రోజుల్లో సగం జీతం మీ అకౌంట్‌లో పొందండి ఇలా

    Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

    గతేడాది కూడా నాగ్‌పూర్‌లోని క్యాంపస్‌లో నిర్వహించిన హెచ్‌సీఎల్ మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈసారి కూడా అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులకు అవకాశాలు కల్పిస్తున్నామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల భద్రత, శ్రేయస్సు కోసం వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లో డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. నాగ్‌పూర్‌లోని క్యాంపస్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు స్ట్రాటజీస్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పనిచేస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Information Technology, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు