హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana: ఇంటర్ విద్యార్థులకు HCLలో ఐటీ ఉద్యోగం.. ఎంపిక, వేతనం వివరాలిలా..

Telangana: ఇంటర్ విద్యార్థులకు HCLలో ఐటీ ఉద్యోగం.. ఎంపిక, వేతనం వివరాలిలా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం మార్కెట్లో మొత్తం సాఫ్ట్ వేర్(Software) హవానే కొనసాగుతోంది. మిగిలిన రంగాలతో పోల్చితే ఈ రంగంలోనే ఎక్కువగా జీతం(Salary) విషయంలో గ్రోత్(Growth) ఉంటుంది. అందుకే బీటెక్(B Tech) పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు(Students) ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం మార్కెట్లో మొత్తం సాఫ్ట్ వేర్(Software) హవానే కొనసాగుతోంది. మిగిలిన రంగాలతో పోల్చితే ఈ రంగంలోనే ఎక్కువగా జీతం(Salary) విషయంలో గ్రోత్(Growth) ఉంటుంది. అందుకే బీటెక్(B Tech) పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు(Students) ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిలో భాగంగానే క్యాంపస్(Campus) లోనే చాలామంది కొలువులు(Jobs) సంపాదిస్తుంటే.. మరికొంత మంది కమ్యూనికేషన్ స్కిల్స్(Communication Skills) లేక ఉద్యోగం(Job) పొందలేక పోతున్నారు. అటువంటి వారు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా సాప్ట్ వేర్ కొలువుకు సంబంధించిన కోర్సులను నేర్చుకుంటున్నారు. వీటికి కూడా ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు పూర్తి చేసుండాలి.

వీరికి మాత్రమే సాప్ట్ వేర్ కొలువులు వస్తాయనే ధోరణి ఉండేది.. కానీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్ పూర్తిచేస్తే చాలు ఐటీ ఉద్యోగ అవకాశం ఉంటుందని చెబుతోంది. హెచ్ సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి అర్హతలు, ఎంపికలు, ఫీజులు, శిక్షణ, కెరీర్ స్కిల్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

TSPSC Alert: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం..

దీనిలో ఎంపిక కావాలంటే అభ్యర్థుల అర్హత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా 2021, 2022లో ఉత్తీర్ణులై ఉండాలి. 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. దీనిలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రమాణాలను పరిశీలిస్తారు. తర్వాత 12 నెలల కాలానికి శిక్షణ ఉంటుది. దీనికి ఫీజు రూ. 2లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షల కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రైనింగ్ లో నిర్వహించే పరీక్షలో 90 శాతం అంతకన్నా ఎక్కువ స్కోర్ చేసిన వారికి ప్రోగ్రామ్ ఫీజులో 100 శాతం రాయితీ కల్పించనున్నారు.

85 నుంచి 90 శాతం మధ్య ఉంటే.. 50 శాతం రాయితీ ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్ సీఎల్ టెక్నాలజీలో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ఎంపికైన అభ్యర్థులను లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ , హైదరాబాద్ , బెంగళూరు, నాగపూర్లోని కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. టెక్ బీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంషిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేలచొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం రూ.1.70 లక్షల నుంచి రూ.2.20లక్షల వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఇలా.. https://www.hcltechbee.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి.. https://www.hcltechbee.com/about-us/#check-before లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

LIC AAO Jobs: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

ఇంటర్న్‌షిప్ పూర్తైన తర్వాత రెండున్నర లక్షల (సంవత్సరానికి) ప్యాకేజీ ఇస్తారు. అంతేకాకుండా.. వీళ్లకు ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటీ యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కూడా కల్పిచంనున్నట్లు ఇటీవల తెలంగాణ విద్యాశాఖ మంత్రి వివరించారు. ఇలా ప్రతీ సంవత్సరం శాలరీ ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయని.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఇది సువర్ణావకాశమని మంత్రి పేర్కొన్నారు.

First published:

Tags: Intermediate, JOBS, Software, Software jobs, Telangana jobs

ఉత్తమ కథలు