HCL: ఇంటర్‌తోనే ఐటీ ఇంజనీర్ ఉద్యోగం.. అటు జాబ్ చేస్తూనే..

JOBS AT HCL: ప్రముఖ MNC కంపెనీ HCL ఇంటర్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. మౌలిక, టెస్టింగ్, CAD సపోర్ట్, తదితర రంగాల్లో ప్రవేశ స్థాయి ఉద్యోగాలు ఇస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 1:23 PM IST
HCL: ఇంటర్‌తోనే ఐటీ ఇంజనీర్ ఉద్యోగం.. అటు జాబ్ చేస్తూనే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 1:23 PM IST
ఇంటర్నీడియట్ పూర్తి చేశారా? పై చదువులు చదవలేక ఉద్యోగం కోసం చూస్తున్నారా? అవకాశాలు ఎప్పుడొస్తాయా అని వేచి చూస్తున్నారా? అయితే మీ కోసం అద్భుతమైన అవకాశం అందిస్తోంది ప్రముఖ MNC కంపెనీ HCL. 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. మౌలికరంగం, టెస్టింగ్, CAD సపోర్ట్, తదితర రంగాల్లో ప్రవేశ స్థాయి ఉద్యోగాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. 12 నెలల పాటు కంపెనీనే శిక్షణ ఇచ్చి, ఆ కాలంలో నెలకు రూ.10వేల జీతం కూడా ఇస్తుంది. అంతేకాదు, HCL నిధులతో Sastra Universityలో బీసీఏ లేదా, BITS PILANIలో బీఎస్సీ కూడా చేయొచ్చు. అయితే, అందులో చేరేందుకు రూ.2లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ఏడాదికి రూ.2.0లక్షల నుంచి రూ.2.2 లక్షల వేతనం ఇస్తుంది.

విద్యార్హతలు:
ఇంటర్‌లో 60 శాతం మార్కులు సాధించాలి.

గణితం/వ్యాపార గణితం కచ్చితంగా చదివి ఉండాలి.
2018, 2019 ఏడాదిలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.


వాక్-ఇన్/ఇంటర్వ్యూ కోసం..
స్కిల్ ట్రైనింగ్ సెంటర్, బ్రైట్ లైట్ సొసైటీ, బీబీఆర్ హాస్పిటల్ దగ్గర, భారత్ లాడ్జి పక్కన, చైనా బజార్, నవజీవన్ నగర్, బాల్‌నగర్, సికింద్రాబాద్-500042.
Loading...
మరిన్ని వివరాలకు 8448386391 నంబరుకు మిస్ కాల్ ఇవ్వచ్చు లేదా ఈ వెబ్‌సైట్ http://www.hcltechbees.com/ ను సంప్రదించండి. techbee.telangana@hcl.com కు మెయిల్ కూడా చేయొచ్చు.
First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...