నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సెంట్రల్, స్టేట్ లెవల్‌లో ఉద్యోగాల(Jobs)కు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. మరికొన్నింటికి ఇటీవలే నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని.. పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యాన్ని అందుకోవచ్చు. అర్హతలను బట్టి ఏ ఉద్యోగానికి అప్లై చేస్తే మంచిదనే విషయాలపై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జాబితా తెలుసుకోండి.
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD).. 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 18న ప్రారంభమైంది. ఆగస్టు 7న ముగుస్తుంది. ఎంపికైన అభ్యర్థులు రూ.55,600 వరకు జీతం అందుకునే అవకాశం ఉంది.
ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ(Indian Army)లో 60వ పురుషుల షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ (SSC TECH), 31వ మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ (SSC TECH) ఆఫీసర్ల పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. మొత్తం 191 స్థానాలకు అర్హులైన అభ్యర్థులను నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు జీతం లభిస్తుంది. దరఖాస్తులను ఆగస్టు 24 మధ్యాహ్నం 3 గంటల వరకు సమర్పించవచ్చు.
TNPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-I (గ్రూప్-1 సర్వీసెస్) కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. వివిధ విభాగాలలో మొత్తం 92 ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. అభ్యర్థులను మూడు దశల్లో స్క్రీనింగ్ చేసి ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 22లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
MPSC మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 17లోపు దరఖాస్తు చేసుకోవాలి.
హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్స్
ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ హెల్త్ మిషన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO)గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5,505 ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని NHM భావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,500 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Central Govt Jobs, Indian Army, JOBS