Home /News /jobs /

HAS BORED AND WROTE THE JEE EXAM GOT 100 PERCENTILE PRV

JEE Mains: బోర్ కొట్టి జేఈఈ ఎగ్జామ్ రాస్తే.. 100 పర్సంటైల్

ప్రవార్​​ కటారియా జేఈఈ మెయిన్స్​ టాపర్​

ప్రవార్​​ కటారియా జేఈఈ మెయిన్స్​ టాపర్​

జేఈఈ మెయిన్స్​ 2021 సెషన్​ 3 పరీక్షలో 17 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్‌ సాధించారు. అయితే 100 పర్సంటైల్​ సాధించిన 17 మంది విద్యార్థులలో ప్రవార్​ కటారియా ఒకరు. కానీ, ప్రవార్​​ మాత్రం పరీక్ష బోర్​ కట్టి రాశాడట.

    జేఈఈ మెయిన్స్​.. అడ్వాన్స్​డ్​.. ఈ పరీక్షలు ఇంటర్​ పూర్తి చేసుకున్న ప్రతి ఎంపీసీ విద్యార్థికి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ కాలేజీల్లో ప్రవేశం పొందాలంటే ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకున్న కార్పొరేట్​ స్కూళ్లు, కాలేజీలు ఐదు, ఆరో తరగతుల నుంచే ఐఐటీ గ్యారెంటీ అంటూ కోర్సులను ఆఫర్​ చేస్తున్నాయి. ఆ ఐఐటీ సీటుకు డిమాండ్​ అంత ఉంది. అయితే ఈ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. విద్యార్థులంతా తమ ఇష్టాలు మానుకొని, స్నేహితులకూ సమయం ఇవ్వకుండా పగలూ, రాత్రుళ్లు చదువుతూ ఉంటారు. వారందరికీ ఒకటే ధ్యాస ఐఐటీ.. ఐఐటీ.. మరి అటువంటి జేఈఈ పరీక్షలో 100కి 100 పర్సంటైల్​​ వస్తే.. వావ్​ అదుర్స్​ అంటారా.. అవును ఆ విద్యార్థి కష్టపడి చదివాడు అంటారా.. అవును చదివాడు.. కానీ, ఇక్కడ ఓ విద్యార్థి కూడా  జేఈఈలో 100 పర్సంటైల్​ సాధించాడు. అయితే అతను ఆ పరీక్ష ఎందుకు రాశాడో తెలిస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే.. బోర్​ కొట్టి రాశాడంటూ... అవును మీరు విన్నది నిజమే.. కరోనా టైంలో ఏం చేయాలో తెలియక.. బోర్​ కొట్టి జేఈఈ మెయిన్స్​ సెషన్​ 3 రాశాడంటూ.. ఏకంగా 100 పర్సంటైల్​ సాధించాడు.. ఇంతకు ఎవరా విద్యార్థి.. ఏంటా కథ తెలుసుకుందా..



    దాదాపు 7.09 లక్షల మంది విద్యార్థులు జూలై 27న జరిగిన జేఈఈ మెయిన్ సెషన్- 3‌ పరీక్షను రాసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ను ఈ ఏడాది నాలుగుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో నిర్వహించిన సెషన్‌ 1లో 9 మంది విద్యార్థులు 100 శాతం పర్సెంటైల్ స్కోర్ సాధించారు. మార్చిలో నిర్వహించిన సెషన్‌ ‌ 2 లో 13 మంది విద్యార్థులు 100 శాతం పర్సెంటైల్ సాధించారు. సెషన్​‌‌‌‌‌‌‌‌ 3 పరీక్షలో 17 మంది 100 పర్సెంటైల్‌ సాధించారు. ఇక జేఈఈ మెయిన్ చివరి సెషన్‌ను ఆగస్టులోనే నిర్వహించనున్నారు. అయితే 100 పర్సంటైల్​ సాధించిన 17 మంది విద్యార్థులలో ప్రవార్​​ కటారియా ఒకరు. కానీ, ప్రవార్​​ మాత్రం పరీక్ష బోర్​ కట్టి రాశాడట. ప్రవార్​​ ఢిల్లీలో నివాసం ఉంటాడు. ఇంటర్​ పాసయ్యాక అందరిలాగే తనుకూడా ఐఐటీలో సీటు కోసం చదివాడు. జేఈఈ మెయిన్స్​ కోసం కోచింగ్​ తీసుకొని మెదటి సెషన్​లోనే 100 పర్సంటైల్​ సాధించాడు కూడా. ఇంకేం అడ్వాన్స్​డ్​కు అర్హత సాధించినట్లే. అయితే మనోడికి కరోనా సమయంలో బోర్​ కొట్టేసిందట. సరదాగా స్నేహితులతో గడిపినా మరింత సమయం ఉందట. అంతే మళ్లీ సెషన్​ 3 జేఈఈ మెయిన్స్​కి దరఖాస్తు చేసుకున్నాడు. అలా వెళ్లి ఇలా రాసి వచ్చాడు. మళ్లీ 100 పర్సంటైల్ తెచ్చుకుని ఔరా అనిపించుకున్నాడు. దీనిపై ప్రవార్​ స్పందిస్తూ.. ‘‘తొలిదశలోనే 100 పర్సంటైల్​ మార్కులు వచ్చినా.. కరోనా టైంలో బాగా బోర్​ కొట్టింది. అందుకే థర్డ్​ ఫేజ్​లోనూ ఎగ్జామ్​ రాశా” అన్నాడు. ఐఐటీ బాంబేలో బీటెక్​ చేయాలనేది తన కల అంటున్నాడు. కంప్యూటర్​ సైన్స్​ ఇంజనీరింగ్​ చేస్తానని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్​ సైన్స్​కు భవిష్యత్తు ఎక్కువగా ఉందని అన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్​ అంటే ఇష్టమట. ఫార్ములాలు, సిద్ధాంతాలపై మక్కువ ఎక్కువని తెలిపాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Exams, JEE Main 2021, Student

    తదుపరి వార్తలు