హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Private Job Reservation: ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక రిజర్వేషన్లు.. ఆ రాష్ట్ర నిరుద్యోగులకు ఇక పండగే..

Private Job Reservation: ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానిక రిజర్వేషన్లు.. ఆ రాష్ట్ర నిరుద్యోగులకు ఇక పండగే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండవు. అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించేలా చట్టంలో సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి అందరికీ తెలిసిందే. కులం, స్థానిక ఆధారంగా ఉద్యోగాల్లో ప్రత్యేక సౌకర్యాన్ని కొన్ని వర్గాలకు కల్పిస్తారు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు కూడా రిజర్వేషన్లను అందుబాటులో తీసుకురానుంది హరియాణా రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు రంగంలో ఏ ఉద్యోగమైన 75 శాతం స్థానికులకే అవకాశమిచ్చేలా ప్రైవేటు జాబ్ రిజర్వేషన్ చట్టానికి సవరణలు తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా శుక్రవారం ప్రకటించారు. మే 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు గురుగ్రామ్-ఫరిదాబాద్ రహాదారిపై బాంధ్వాడీ గ్రామ సమీపంలో నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

పారిశ్రామిక వేత్తలతో చర్చించాం..

వివరాల్లోకి వెళ్తే 2021 మే 1 తర్వాత రాష్ట్రంలో ఏ పరిశ్రమ లేదా సంస్థ నూతనంగా ఉద్యోగులను నియమించుకోవలసి వస్తే ప్రతి నలుగురిలో ముగ్గురికి ఆ రాష్ట్రానికి చెందిన వారినే తీసుకోవాలని ఆయన అన్నారు. "మొదటి నుంచి ఏ చట్టం కూడా పరిపూర్ణంగా లేదు. అయితే ఈ చట్టంలో సవరణలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకు రావడానికి ముందు మేము పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో 8 దశల్లో సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించాం. వారి వద్ద నుంచి రాతపూర్వక సూచనలు కూడా కోరాం" అని దుష్యంత్ చౌటాలా తెలిపారు. వారం క్రితం పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో సమావేశం నిర్వహించినట్లు హరియాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఫరిదాబాద్ కు చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎస్కార్ట్స్ సంస్థ ఛైర్మన్ నిఖిల్ నందాతో భేటీలో పాల్గొన్నామని, ఇలాంటి చట్టాలు తప్పకుండా రాష్ట్రంలో ఉండాలని ఆయన కూడా చెప్పినట్లు తెలిపారు.

టెక్నికల్ ఉద్యోగాలకు మినహాయింపు..

"ప్రభుత్వ ఉద్యోగాల్లో జేఈ పే గ్రేడ్ 50 వేలకు తగ్గించాలని మాకు సూచనలు వచ్చాయి. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఇది కాకుండా పరిశ్రమల్లో లేదా స్పెషల్ స్కిల్స్ ను ఉపయోగించే ప్రైవేటు సంస్థల్లోని సాంకేతిక పోస్టులను ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని చాలా మంది సూచించారు. అందుకని టెక్నికల్ స్కిల్స్ కలిగిన పోస్టులకు ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుందని, దీన్ని ఇప్పటికే ఈ చట్టంలో నిబంధన పెట్టాం" అని దుష్యంత్ చౌటాలా వెల్లడించారు. గత అక్టోబరులో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా దుష్యంత్ చౌటాలా ప్రైవేటు ఉద్యోగుల రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. ప్రైవేటు రంగంలో మూడో వంతు ఉద్యోగాలు స్థానికులకే పొందేలా చూస్తామని ప్రకటించారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Govt Jobs 2021, Haryana, Job, JOBS

ఉత్తమ కథలు