ఇటీవల తెలంగాణ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లను(Notifications) వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే దరఖాస్తుల ప్రక్రియ కూడా గత నెలలో ముగిశాయి. తాజాగా వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ను(Hall Tickets) విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్టు(High Court).. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 50, అసిస్టెంట్ 10, ఎగ్జామినర్ 17 పోస్టులు, సిస్టమ్ అసిస్టెంట్ 45, అప్పర్ డివిజన్ స్టెనో 2 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రేరియన్ 2 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ 20 పోస్టులు, ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య 10, కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఖాళీల సంఖ్య 20 ఖాళీగా ఉన్నాయి. వీటికి హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. మార్చి 31, ఏప్రిల్ 01వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. హైకోర్టు పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 05 వరకు పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. జిల్లా కోర్టుల్లో ఖాళీలకు విడుదల చేసిన పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం 15 రకాల నోటిఫికేషన్లకు సంబంధించి హైకోర్టు హాల్ టికెట్స్ ను విడుదల చేసింది.
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను వెళ్లండి.
-తర్వాత అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ పైక్లిక్ చేయండి. ఈ హాల్ టికెట్స్ హైకోర్టులో ఖాళీ పోస్టులకు విడుదల చేసినవి.
-జిల్లా కోర్టులో ఖాళీ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
-ఇక్కడ మీ లాగిన్ వివరాలను నమోదు చేసి.. లాగిన్ అవ్వాలి.
-ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను ప్రత్యక్షం అవుతాయి. పక్కనే ఉన్న వ్యూ (View) ఆప్షన్ ను ఎంచుకోండి.
-ఇక్కడ మీ అడ్మిట్ కార్డు లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Court jobs, High Court, JOBS, Telangana government jobs, Ts high court