హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

High Court Hall Tickets: హైకోర్టు ఉద్యోగాలకు.. అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

High Court Hall Tickets: హైకోర్టు ఉద్యోగాలకు.. అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

High Court Hall Tickets: ఇటీవల తెలంగాణ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లను వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే దరఖాస్తుల ప్రక్రియ కూడా గత నెలలో ముగిశాయి. తాజాగా వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల తెలంగాణ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లను వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే దరఖాస్తుల ప్రక్రియ కూడా గత నెలలో ముగిశాయి. తాజాగా వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్టు(High Court).. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 05 వరకు పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాల్లోకి వెళ్తే..

01. జూనియర్ అసిస్టెంట్

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. మొత్తం 275 పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేసింది.

02. ఫీల్డ్ అసిస్టెంట్

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 77 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

03. ఎగ్జామినర్

ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మొత్తం 66 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

04. రికార్డ్ అసిస్టెంట్

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

05. ప్రాసెస్ సర్వర్

ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి మొత్తం 163 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

06. ఆఫీస్ సబార్డినేట్

ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని తెలంగాణలోని వివిధ జిల్లాల వారీగా భర్తీ చేస్తారు.

UGC NET Answer Key: అభ్యర్థులకు అలర్ట్.. UGC NET ఓఎంఆర్, ఆన్సర్ కీ విడుదల..

ఈ 6 విభాగాలకు సంబంధించి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. హైకోర్టులో ఖాళీ పోస్టులకు విడుదల చేసిన 9 నోటిఫికేషన్లకు సంబంధించి అడ్మిట్ కార్డులను ఇంకా విడుదల చేయలేదు. అవి కూడా నేడో రేపో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను వెళ్లండి.

-తర్వాత అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

-ఇక్కడ మీ లాగిన్ వివరలను నమోదు చేసి.. లాగిన్ అవ్వాలి.

-ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను ప్రత్యక్షం అవుతాయ. పక్కనే ఉన్న వ్యూ (View) ఆప్షన్ ను ఎంచుకోండి.

-ఇక్కడ మీ అడ్మిట్ కార్డు లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

First published:

Tags: JOBS, Jobs in high court, Telangana High Court

ఉత్తమ కథలు