Home /News /jobs /

HALF DAY SCHOOLS IN TELANGANA FROM MARCH 15 ORDERS ISSUED BY TELANGANA SCHOOL EDUCATION DEPARTMENT SNR

Telangana:మార్చి 15నుంచి ఒంటిపూట బడులు..టెన్త్ స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Half day schools: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రభుత్వం ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 15నుంచి అన్నీ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో ఒంటి పూట తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ (Telangana)వ్యాప్తంగా మార్చి (March)నెల మొదటి వారం నుంచే వేసవి తీవ్రత పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో జనం వేసవి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్య ప్రభుత్వ పాఠశాలు, ప్రైవేట్ విద్యాసంస్ధల్లో చదువుకునే విద్యార్ధుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అంటే ఈనెల 15వ తేది నుంచి స్కూల్స్‌ ఒంటి పూట మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ పాఠశాలలు ఈ ఒంటి పూట బడులు(Half day schools) నిర్వహించాలని సూచించింది. ప్రైమరీ(Primary), ప్రీ ప్రైమరీ(Pre Primary) , సెకండరీ(Secondary)స్కూల్‌ విద్యార్ధులకు ఈనెల 15వ తేది నుంచి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది తెలంగాణ పాఠశాల విద్యాశా(Telangana school education department). ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ పాఠశాల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని మధ్యాహ్నం 12.30గంటలకు యధావిదిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మే నెలలో జరిగే పదవ తరగతి 2021-2022 వార్షిక పరీక్షలకు ప్రివేర్ అవుతున్న విద్యార్ధుల కోసం ప్రత్యేక తరగతలు నిర్వహించబడతాయని పేర్కొంది.

రేపట్నుంచి ఒంటి పూట బడులు..
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని, ఎలాంటి సమస్యలు ఎదుర్కొకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి పాఠశాలల్లో ఈ ఒంటి పూట బడులు సక్రమంగా అమలు జరిగేలా సంబంధింత విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్‌ని అప్పటికే అధికారులు, పాఠశాల యాజమాన్యాలకు పంపడం జరిగింది.

(రేపటి నుంచి ఒంటి పూట బడులు)


టెన్త్‌ స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాస్‌లు..
ఈ ఏడాది మే 20వ తేదీన 10వ తరగతి ప‌రీక్ష‌లు ముగియనున్నాయి. అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Summer, Telangana schools

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు