బెంగుళూరులోని hinలో హెచ్ఏఎల్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా స్టాఫ్‌నర్స్, ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist), ఫార్మాసిస్ట్, డ్రెస్సర్, పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థికి పోస్టుల ఆధారంగా రూ. 15,000 నుంచి రూ.21,473 నెలవారీ వేతనం అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గరిష్ట వయసు 28 ఏళ్లు మించి ఉండకూడదు. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://meta-secure.com/HAL-mh2021/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | అర్హత | ఖాళీలు |
స్టాఫ్ నర్స్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మూడు సంవత్సరాల జనరల్‌లో డిప్లొమాతో పీయూసీ నర్సింగ్ & మిడ్‌వైఫరీ చేసి ఉండాలి. | 07 |
ఫిజియోథెరపిస్ట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిప్లొమాతో పీయూసీ(పీసీబీ), రెండు సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సు చేసి ఉండాలి. | 01 |
ఫార్మసిస్ట్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో రెండు సంవత్సరాల ఫార్మా కోర్సు చేసి ఉండాలి. | 01 |
డ్రెస్సర్ | గుర్తింపు పొందిన సంస్త నుంచి పీయూసీ శిక్షణ సర్టిఫికెట్ ఉండాలి. ప్రథమ చికిత్సలో కోర్సు చేసి ఉండాలి. | 02 |
ఎంపిక విధానం..
Step 1 : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 : అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు.
Step 3 : పరీక్షలో ఉత్తీర్ణులైన వారి డాక్యుమెంట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://meta-secure.com/HAL-mh2021/ ను సందర్శించాలి.
Step 2 : అనంతరం నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 3 : Instructions to Apply Online లింక్‌లో దరఖాస్తు విధానం పూర్తిగా చదవాలి.
Jobs in PhonePe : మ్యూచ్‌వల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు.. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు
Step 4 : ఇన్‌స్ట్రక్షన్‌లు చదవిన తరువాత Register to Apply Online లింక్‌ను క్లిక్ చేయాలి.
Step 5 : అనంతరం అధికారిక లింక్ https://meta-secure.com/HAL-mh2021/Registration లో మొబైల్‌నంబర్, పుట్టిన తేదీ, ఓటీపీ ద్వారా రిజిస్టర్ అయి దరఖాస్తు ఫాం పూర్తి చేయాలి.
Step 6 : అనంతరం రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Step 7 : దరఖాస్తు పూర్తయిన దరువాత సబ్‌మిట్ చేసి. ప్రింట్ తీసుకోవాలి.
Step 8 : ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 14, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS