హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

H-1B visa rules: గుడ్ న్యూస్... హెచ్-1బీ వీసాలతో యూఎస్ వెళ్లొచ్చు... కానీ షరతులు వర్తిస్తాయి

H-1B visa rules: గుడ్ న్యూస్... హెచ్-1బీ వీసాలతో యూఎస్ వెళ్లొచ్చు... కానీ షరతులు వర్తిస్తాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.

H-1B Visa Rules | హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించిన అమెరికా ఆంక్షల్ని కాస్త సడలించింది. కొన్ని షరతులతో ఉద్యోగులను అమెరికాలోకి అనుమతించనుంది.

ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. హెచ్-1బీ వీసా నిబంధనల్ని సడలించింది అమెరికా ప్రభుత్వం. హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ వెళ్లాలనుకునేవారి ఆశలు అడియాశలయ్యాయి. అయితే హెచ్-1బీ వీసాల విషయంలో కొన్ని మినహాయింపుల్ని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఈ మినహాయింపులకు కూడా షరతులు వర్తిస్తాయి. హెచ్-1బీ వీసాల ద్వారా అందర్నీ అమెరికాలోకి అనుమతించరు. హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించడానికన్నా ముందు అమెరికాలో ఉద్యోగాలు ఉన్నట్టయితే వాళ్లను తిరిగి అమెరికాలోకి అనుమతిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. హెచ్-1బీ, ఎల్1 వీసాలు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. అది కూడా వీసాలపై నిషేధం విధించడం కన్నా ముందు వారికి అమెరికాలో ఉద్యోగాలు ఉండాలి. తిరిగి ఆ ఉద్యోగాల్లోనే పనిచేసేందుకు వస్తేనే వారికి అమెరికా రావడానికి అనుమతి ఉంటుంది. అంటే గతంలో పనిచేసిన ఉద్యోగాల్లో మళ్లీ పనిచేయడానికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సడలింపుల ప్రకారం ఉద్యోగులతో పాటు వారి డిపెండెంట్లు అంటే జీవితభాగస్వాములు, పిల్లలకు కూడా అనుమతి ఉంది. హెచ్-1బీ వీసా ఉన్న టెక్నికల్ స్పెషలిస్ట్, సీనియర్ లెవెల్ మేనేజర్ లాంటి ఉద్యోగులను, అమెరికా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు ఉపయోగపడేవారిని మాత్రమే అనుమతిస్తోంది యూఎస్ ప్రభుత్వం. అంతేకాదు పబ్లిక్ హెల్త్ లేదా హెల్త్‌కేర్ సిబ్బంది, మెడికల్ రీసెర్చర్ లాంటివారికి అనుమతిస్తోంది.

Jobs: వెంటనే ఉద్యోగం కావాలా? కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

H-1B Visa rules, H-1B Visa new rules, H-1B Visa rules relaxation, what is H-1B Visa, how to apply for H-1B Visa, donald trump, covid 19, హెచ్1 బీ వీసా రూల్స్, హెచ్1 బీ వీసా కొత్త నిబంధనలు, హెచ్1 బీ వీసా అంటే ఏంటీ, హెచ్1 బీ వీసా అప్లికేషన్, డోనాల్డ్ ట్రంప్
ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని కంపెనీల్లో ప్రత్యేక పోస్టుల్లో విదేశీయులు తాత్కాలికంగా పనిచేయాలంటే హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రంట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్-1బీ వీసాలను ఇస్తుంది అమెరికా ప్రభుత్వం. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను ఆఫర్ చేస్తుంటాయి. భారతదేశం నుంచి వేలాది మంది హెచ్-1బీ వీసాలతో వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారే. అమెరికాకు వెళ్లేందుకు హెచ్-1బీ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే హెచ్-1బీ, ఎల్1 లాంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాలోకి రావడాన్ని ఈ ఏడాది చివరి వరకు నిషేధిస్తూ జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిషేధంపై కొన్ని సడలింపుల్ని ప్రకటించింది.

First published:

Tags: America, CAREER, Donald trump, H1B Visa, JOBS, Trump, USA

ఉత్తమ కథలు