TGCET 2021: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గురుకులాల టీజీసెట్‌ దర‌ఖాస్తు గడువు పెంపు

ప్రతీకాత్మక చిత్రం

గురుకులాల టీజీసెట్-2021 దరఖాస్తు గడువును పొడగించారు. ఈ మేరకు టీజీసెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు.

  • Share this:
    రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యా సంవ‌త్సరానికి గానూ 5వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్‌-2021 నిర్వహించనున్నారు. ఇందుకోసం దరఖాస్తు గడువు నిన్నటితో(ఏప్రిల్ 3) ముగిసింది. అయితే ఈ దరఖాస్తు పొడగిస్తున్నట్టు టీజీసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. టీజీసెట్ గడువును ఏప్రిల్ 15వరకు పొడగిస్తున్నట్టు చెప్పారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు టీజీసెట్‌-2021కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేయడం కోసం 180042545678 అనే టోల్‌ ఫ్రీ నంబరును కూడా ప్రారంభించారు. ఇక, ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.

    www.tswreis.in , tgcet.cgg.gov.in, trresidential.gov.in, tgtwgurukulam.telangana.gov.in, mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా టీజీసెట్-2021కు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఆప్లికేషన్స్ స్వీకరిస్తారు. ఆప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేయనున్నారు.

    వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు..
    సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ సొసైటీ- 18,560
    గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777
    బీసీ సంక్షేమ సొసైటీ- 20,800
    జనరల్‌ వెల్ఫేర్‌ సొసైటీ- 2800
    మొత్తం-46,937
    Published by:Sumanth Kanukula
    First published: