హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Gurukula Admission: గురుకుల అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే

Gurukula Admission: గురుకుల అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Gurukula Admission: గురుకులాల్లో చదవాలనుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. త్వ‌ర‌లో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తేదీ ముగియ‌నుంది ఈ నేప‌థ్యంలో విద్యార్థుల సౌక‌ర్యార్థం ద‌ర‌ఖాస్తు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది.

ఇంకా చదవండి ...

గురుకులా (Gurukulas) ల్లో చదవాలనుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతిలో ప్రవేశాల కోసం తెలంగాణ (Telangana)  సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నోటిఫికేషన్‌‌ను ఇప్ప‌టికే విడుదల చేసింది. దీనికి సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఒక్క ప్రవేశ పరీక్షతో సాంఘీక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం పొందే వీలుంటుంది. అందుకోసం ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ (Online) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు గ‌డువును ఏప్రిల్ 14, 2022 వ‌ర‌కు పొడ‌గించారు.

Telangana Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ప్రిప‌రేష‌న్ బుక్స్‌పై తెలుగు అకాడ‌మీ తాజా నిర్ణ‌యం!

తాజా తేదీలు..

- ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఏప్రిల్ 14, 2022

- ప‌రీక్ష నిర్వ‌హ‌ణ తేదీ మే 8, 2022

ముఖ్య‌మైన స‌మాచారం..

- విద్యార్థులు గురుకులాల ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- ఇందుకోసం రూ.100 ఆప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

Jobs in AP: విజ‌య‌వాడ హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 53,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

- ఇందుకోసం విద్యార్థులు www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉండాలి.

- విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి.

Jobs in Telangana: సింగ‌రేణి కొల‌రీస్‌లో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూలు

- ప్రవేశ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా గురుకుల పాఠశాలల్లోని ఐదో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.

- పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకొనేందుకు నోట్ - టోల్ ఫ్రీ నంబ‌ర్‌ - 1800 425 45678

First published:

Tags: EDUCATION, Telangana, Ts gurukula

ఉత్తమ కథలు