Career: వ్యవసాయం రంగంలో కెరీర్‌... కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ ఇదే...

కాలేజీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. రైతుల శ్రమకు తగ్గ ఫలితాలను అందించగలిగే వ్యవసాయ నిపుణులు ఇక్కడ తయారవుతున్నారు. వ్యవసాయ రంగంలో వాస్తవ పరిస్థితుల్ని, పెరుగుతున్న సవాళ్లను అర్థం చేసుకొని, హానికరమైన ఎరువులు, పురుగుల మందును తక్కువగా వాడేలా రైతులను ప్రోత్సహించడం కేవలం నిపుణులు ద్వారానే సాధ్యం.

news18-telugu
Updated: April 25, 2019, 7:26 PM IST
Career: వ్యవసాయం రంగంలో కెరీర్‌... కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ ఇదే...
Career: వ్యవసాయం రంగంలో కెరీర్‌... కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ ఇదే... (image: Guru kashi university)
news18-telugu
Updated: April 25, 2019, 7:26 PM IST
వ్యవసాయం... ఈ మాట వింటే ఓవైపు పచ్చని పొలాలు గుర్తొస్తాయి. మరోవైపు రైతుల వ్యథలు కళ్లముందు కనిపిస్తాయి. దేశంలో రైతుల కష్టాలు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక చేసుకుంటున్న ఆత్మహత్యల గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏం లేదు. అదే కథ. అదే వ్యథ. గ్రామాలు, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు ఉన్నా... రైతుల కష్టాలు తీరట్లేదు. ప్రభుత్వాలు రైతుల్ని సాయాలతో ఆదుకుంటున్నా... వ్యవసాయం అంటేనే రైతుల్లో భయం నెలకొన్న పరిస్థితి ఉంది. అందుకే వ్యవసాయం వదిలేసి ఇతర వృత్తుల వైపు నడుస్తున్నారు అన్నదాతలు. మరి అలాంటి వ్యవసాయాన్ని ఓ కెరీర్‌గా ఎవరైనా ఎంచుకుంటారా? లేదన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ పంజాబ్‌లోని గురు కాశీ యూనివర్సిటీ వ్యవసాయ రంగంలో కోర్సుల్ని అందిస్తోంది. వ్యవసాయాన్ని ఓ కెరీర్‌గా ఎంచుకునే అవకాశాన్ని యువతకు కల్పిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన మ్యాస్ట్రో డైనమిక్స్ సంస్థ పంజాబ్‌లో ఉన్న గురు కాశీ యూనివర్సిటీకి అడ్మిషన్ అండ్ మార్కెటింగ్ పార్ట్‌నర్‌గా ఉండటం విశేషం. అడ్మిషన్స్ చేయించడం మాత్రమే కాదు... అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్ అందిస్తామంటున్నారు మ్యాస్ట్రో డైనమిక్స్ సీఈఓ వీఎస్ భావన్ రెడ్డి.

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అగ్రికల్చర్ కోర్సులు అందించే కాలేజీల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ సంవత్సరం గురు కాశీ యూనివర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు గురు కాశీ యూనివర్సిటీకి ICAR అక్రిడిటేషన్ కూడా లభించింది. చాలామంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చేరుతున్నారు. నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు మంచి భవిష్యత్తు ఉంది.
వీఎస్ భావన్ రెడ్డి, మ్యాస్ట్రో డైనమిక్స్ సీఈఓ


agriculture courses, agriculture courses after 12th, agriculture courses in india, agriculture courses after 10th, agriculture courses, agriculture course details, guru kashi university, guru kashi university prospectus, guru kashi university hostel courses, వ్యవసాయం, అగ్రికల్చర్ కోర్సులు, గురు కాశీ యూనివర్సిటీ కోర్సులు, వ్యవసాయం కోర్సులు, కెరీర్ గైడెన్స్
image: Guru kashi university
కాలేజీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. రైతుల శ్రమకు తగ్గ ఫలితాలను అందించగలిగే వ్యవసాయ నిపుణులు ఇక్కడ తయారవుతున్నారు. వ్యవసాయ రంగంలో వాస్తవ పరిస్థితుల్ని, పెరుగుతున్న సవాళ్లను అర్థం చేసుకొని, హానికరమైన ఎరువులు, పురుగుల మందును తక్కువగా వాడేలా రైతులను ప్రోత్సహించడం కేవలం నిపుణులు ద్వారానే సాధ్యం. రోజురోజుకూ జనాభా పెరుగుతున్న భారతదేశంలో ఆహార అవసరాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని మొదటి స్థానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. శిక్షణ పొందిన వ్యవసాయ రంగ నిపుణులతోనే ఇది సాధ్యమవుతుంది. అందుకే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గురు కాశీ యూనివర్సిటీ కోర్సుల్ని అందిస్తోంది. గురు కాశీ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సుల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

agriculture courses, agriculture courses after 12th, agriculture courses in india, agriculture courses after 10th, agriculture courses, agriculture course details, guru kashi university, guru kashi university prospectus, guru kashi university hostel courses, వ్యవసాయం, అగ్రికల్చర్ కోర్సులు, గురు కాశీ యూనివర్సిటీ కోర్సులు, వ్యవసాయం కోర్సులు, కెరీర్ గైడెన్స్
image: Guru kashi university


పంజాబ్‌లోని గురు కాశీ యూనివర్సిటీలో 7000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టళ్లు ఉన్నాయి. డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ కోర్సుల్ని అందిస్తోంది ఈ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీలో చేరేందుకు మ్యాస్ట్రో డైనమిక్స్ కావాల్సిన సహకారాన్ని అందిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న మ్యాస్ట్రో డైనమిక్స్ సంస్థకు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. నెల్లూరుకు చెందిన భావన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరాలని విద్యార్థుల్ని కోరుతున్నారు.
Loading...
Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా
First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...