లక్షకు పైగా ఖాళీలను విడుదల చేసిన పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డు నేడు జరగాల్సిన జూనియర్ క్లర్క్ ఉద్యోగ పరీక్షను వాయిదా వేసింది. దీంతో 9లక్షలకు పైగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లో మరోసారి పేపర్ లీక్ వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జనవరి 29న అంటే ఈరోజు జరగాల్సిన జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేశారు. గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై గుజరాత్(Gujarat) ఏటీఎస్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఐదుగురు గుజరాత్ వాసులేనని గుజరాత్ ఏటీఎస్ తెలిపింది. హైదరాబాద్, ఒడిశా, మద్రాసులో ఏటీఎస్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సంబంధమున్న వారందరినీ త్వరలో అరెస్టు చేస్తామన్నారు. నిందితులందరినీ విచారిస్తున్నారు.
యువకుడి అరెస్టు..
ఈ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న ఇసామ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర్నుంచి పరీక్ష ప్రశ్నపత్రం కాపీ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి పరీక్ష జరగాల్సి ఉంది. అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు వెళ్లవద్దని సూచించారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. పరీక్ష కేంద్రాలకు చేరిన వారిని సొంతూళ్లకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా GSRTC బస్సులను ఏర్పాటుచేసింది.
కరోనా తర్వాత అతిపెద్ద పరీక్ష..
రెండు సంవత్సరాల కరోనా తర్వాత మరియు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రాష్ట్రంలో ఇప్పటివరకు అతిపెద్ద రిక్రూట్‌మెంట్ పరీక్ష ఇదే. పంచాయితీ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ తరపున.. క్లాస్ III జూనియర్ క్లర్క్ మొత్తం 1 వేల 185 పోస్టులకు ఈ రోజు రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 53 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ పరీక్ష 2 వేల 995 పరీక్షా కేంద్రాల్లో జరగాల్సి ఉంది.
చాలా కాలం తర్వాత పోటీ పరీక్షలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగాల్సి ఉంది. ఇందుకోసం అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 53 వేల 723 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. అదే సమయంలో భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు ఏడున్నర వేల మంది పోలీసులు పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. కానీ చివరకు ఇలా జరగడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను త్వరలోనే నిర్వహిస్తామని బోర్డ్ స్పష్టం చేసింది. గతంలో పేపర్ లీక్ ఘటనలకు సంబంధించిన వ్యక్తులపై గుజరాత్ ఏటీఎస్ నిఘా ఉంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Gujarat, JOBS, Paper leak