HOME »NEWS »JOBS & EDUCATION »gst new rules about employees who exit company without serving notice period hsn gh

GST on notice period recovery: నోటీస్ పీరియడ్‌ను ఉల్లంఘించి మరీ ఉద్యోగులు కంపెనీకి రాజీనామా చేసి వెళ్తే..

GST on notice period recovery: నోటీస్ పీరియడ్‌ను ఉల్లంఘించి మరీ ఉద్యోగులు కంపెనీకి రాజీనామా చేసి వెళ్తే..
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా నోటీస్ పీరియడ్ వరకు ఉద్యోగం చేయకుండా, మధ్యలోనే ఉద్యోగి కంపెనీ నుంచి వెళ్లిపోయినప్పుడు.. వారి నుంచి ఒప్పందం ప్రకారం కొంత డబ్బు వసూలు చేస్తారు. దీన్నే recovery of notice pay అంటారు. దీనిపై అదనంగా 18శాతం జీఎస్‌టీ చెల్లించాలని తాజాగా అధికారులు చెబుతున్నారు. అపాయింట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి నోటీస్ పీరియడ్ వరకు పనిచేయాల్సి ఉంటుంది.

  • Share this:
జీఎస్‌టీ (GST) అమల్లోకి వచ్చిన తరువాత ట్యాక్స్ చెల్లింపుల విధానంపై అధికారులు సైతం కొన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో ఎప్పటికప్పుడూ తీసుకునే కొత్త నిర్ణయాల ప్రకారం ట్యాక్స్ స్లాబ్‌లను చాలాసార్లు మార్చారు. దీంతో ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు కూడా ఎంత ట్యాక్స్ కట్టాలనే అంశంపై అవగాహన లేక తికమకపడ్డారు. సర్వీస్ ట్యాక్స్‌ను జీఎస్‌టీలో చేర్చిన తరువాత ఉద్యోగులు చెల్లించే ట్యాక్స్‌ రేటులో తేడాలు వచ్చాయి. తాజాగా జీఎస్‌టీ చట్టం ప్రకారం నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండా ఒక కంపెనీకి రాజీనామా చేసి వెళ్లిపోయే ఉద్యోగులు సైతం నోటీస్ పీరియడ్ వేతన రికవరీపై (recovery of notice pay) 18 శాతం ట్యాక్స్ చెల్లించాలని గుజరాత్‌కు చెందిన జీఎస్‌టీ అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి గుజరాత్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ తీర్పు ఇచ్చింది.

సాధారణంగా నోటీస్ పీరియడ్ వరకు ఉద్యోగం చేయకుండా, మధ్యలోనే ఉద్యోగి కంపెనీ నుంచి వెళ్లిపోయినప్పుడు.. వారి నుంచి ఒప్పందం ప్రకారం కొంత డబ్బు వసూలు చేస్తారు. దీన్నే recovery of notice pay అంటారు. దీనిపై అదనంగా 18శాతం జీఎస్‌టీ చెల్లించాలని తాజాగా అధికారులు చెబుతున్నారు. "అపాయింట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి నోటీస్ పీరియడ్ వరకు పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని ఉల్లంఘించినవారు కంపెనీ వసూలు చేసే నోటీస్ పీరియడ్ వేతన రికవరీపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందని మేము భావిస్తున్నాం” అని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



మినహాయింపు కిందకు రాదు
అహ్మదాబాద్‌కు చెందిన అమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ (Amneal Pharmaceuticals) కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ సంస్థ 100 శాతం ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్ (EOU)గా నమోదు చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ కంపెనీ ఉద్యోగుల నోటీస్ పీరియడ్ మూడు నెలలుగా ఉంది. దీనిపై ఒక ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై అథారిటీ తీర్పు ఇచ్చింది. నిర్ణీత నోటీసు పీరియడ్ నిబంధనను ఉల్లంఘించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమేనని అథారిటీ అభిప్రాయపడింది. ఇందుకు గానూ ఉద్యోగి నుంచి వసూలు చేసే నోటీస్ పీరియడ్ వేతన రికవరీ మొత్తం GST పరిధిలోకి వస్తుందని తెలిపింది. GST చట్టం ప్రకారం ఇది ఎంప్లాయర్, ఎంప్లాయీ రిలేషన్‌షిప్ కింద పేర్కొన్న మినహాయింపు కిందకు రాదని అథారిటీ పేర్కొంది.
Published by:Hasaan Kandula
First published:January 15, 2021, 17:50 IST

टॉप स्टोरीज