Google Certification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... గూగుల్ సర్టిఫికేషన్లతో ఉద్యోగాలు

Google Certification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... గూగుల్ సర్టిఫికేషన్లతో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Google Certification | గూగుల్ ప్రారంభించిన గ్రో విత్ గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్ ప్రోగ్రాం ద్వారా డేటా ఎనలిటిక్స్, యూజర్ ఎక్స్ పీరియెన్స్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది.

  • Share this:
గూగుల్ సంస్థ కొత్తగా ఆన్ లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలను ప్రారంభించనుంది. ఆండ్రాయిడ్ డెవలప్ మెంట్, డేటా అనాలిటిక్స్ వంటి సబ్జెక్టుల్లో కెరీర్ సర్టిఫికెట్లు అందజేయనున్నామని ప్రకటించిందీ సంస్థ. ఇది జాబ్ మార్కెట్లో ఎన్నో మార్పులను తీసుకురానుంది. గూగుల్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందడం ఓ పెద్ద విషయమైతే అది తక్కువ ఖర్చుతోనే పొందగలిగేలా ఉండడం మరో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అంతే కాదు.. తమ దగ్గర కోర్సు పూర్తి చేసిన వారికి తమ సంస్థతో పాటు మరో 130 సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా గూగుల్ సిద్ధమవుతోందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. కానీ ఈ సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారికి ఉద్యగాల్లో చేరేంత నైపుణ్యాలు ఉంటాయా? భారతీయ సంస్థలు ఈ సర్టిఫికేషన్ ని ఓ డిగ్రీగా పరిగణించి ఉద్యోగాలు అందించేందుకు సిద్ధమవుతాయా? అన్నది తెలియడానికి ఇంకా కొంత కాలం పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారతీయ కంపెనీలు కేవలం సంప్రదాయ డిగ్రీలు ఉన్నవారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఈ కోర్సులను ఓ ఎక్స్ ట్రా బెనిఫిట్ గా చూస్తున్నాయే తప్ప వీటిపైనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాలి.

గూగుల్ ప్రారంభించిన గ్రో విత్ గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్ ప్రోగ్రాం ద్వారా డేటా ఎనలిటిక్స్, యూజర్ ఎక్స్ పీరియెన్స్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. దీనికి గూగుల్ ప్రముఖ ఆన్ లైన్ కోర్స్ ప్లాట్ ఫాం కోర్సెరా సహాయం కూడా తీసుకుంటోంది. కోర్సెరా ద్వారా అయితే నెలకు 39 డాలర్లు (రూ. 2825)చెల్లించి ఈ కోర్సును పూర్తి చేసే వీలుంటుంది. అదే ప్రస్తుతం అందిస్తోన్న సర్టిఫికెట్ కోర్సు ద్వారా కేవలం 149 డాలర్లు (రూ. 10800) పరీక్ష ఫీజు చెల్లిస్తే చాలు.. ఫ్రీ కోర్సు మెటీరియల్ ఉపయోగించుకోవచ్చు. దీనికోసం గూగుల్ లక్ష మందికి స్కాలర్ షిప్స్ కూడా అందించనుంది. ఈ స్కాలర్ షిప్ లను స్వచ్ఛంద సంస్థలు, వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ బోర్డ్స్, ఇతర కమ్యునిటీ ఆర్గనైజేషన్ ల సహకారంతో అందిస్తోంది గూగుల్. అమెరికాలో ఈ సర్టిఫికెట్స్ పొందిన 500 మందికి తాము ఉద్యోగాలు ఇస్తామని ఇన్ఫోసిస్, రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని బెటర్. కామ్ వెల్లడించాయి. భారత్ లోనూ ఎప్లాంయీస్ కన్సార్టియం ప్రారంభించి దాని ద్వారా ఈ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించే పనిలో ఉన్నామని సుందర్ పిచాయ్ తన బ్లాగ్ లో వెల్లడించారు.

భారత్ లో టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య స్కిల్స్ లోపం.. మన విద్యా విధానంలో థియరీ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నా ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. ఈ లోటును సర్టిఫికెట్ ప్రోగ్రాం తీరుస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గూగుల్ విద్యార్థులకు స్కిల్స్ నేర్పిస్తే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ఇది చాలా మంచి పరిణామమని చాలా కంపెనీలు వెల్లడిస్తుండడం విశేషం. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు కోరుకునే వారే కాదు.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా తమ స్కిల్స్ ని పెంపొందించుకునేందుకు ఇదో మంచి దారి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల అతి తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసి మంచి జీతంతో ఉద్యోగాలు సంపాదించే వీలుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ లాంటి సంస్థ స్కిల్స్ నేర్పించడం జరిగితే వారిని తీసుకోవడానికి చాలా కంపెనీలు ఆసక్తిచూపుతాయి. పైగా కన్సార్టియం సాయంతో గూగుల్ వారికి నేరుగా ఉద్యోగాలు కూడా అందేలా చేస్తుండడంతో ఈ కోర్సులు నిరుద్యోగుల పాలిటి వరం అనే చెప్పుకోవాలంటున్నారు నిపుణులు.

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... అప్లై చేయండి ఇలా

BRO Recruitment 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 జాబ్స్

అయితే ఇప్పటికే చాలా కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటుండడం వల్ల ఏయే సంస్థలతో గూగుల్ కన్సార్టియం ఏర్పాటు చేస్తుందో చూసి వాటిలో చేరడం మంచిది. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఈ ఆన్ లైన్ స్కిల్ డెవలప్ మెంట్ ప్లాట్ ఫాంలలో కోర్సులు నేర్చుకునేందుకు సహాయం కూడా చేస్తున్నాయి. మరెన్నో సంస్థలు గ్రేట్ లెర్నింగ్, యుడాసిటీ వంటి సంస్థలతో చేరి వారి దగ్గర స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ ఈ ప్రోగ్రాంలను ప్రారంభించడం వల్ల దేశంలో ఆర్థిక వృద్ధి, నైపుణ్యాల పెరుగుదల వంటివి జరుగుతాయని వారు భావిస్తున్నారు.

అయితే 2018 లోనూ ఐటీ సపోర్ట్ సర్టిఫికేషన్ పేరుతో ఓ కోర్సును ప్రారంభించింది గూగుల్. ఆ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు అందించేందుకు సంస్థలు పెద్దగా ముందుకురాలేదు. దీనికి కారణం ఇది సాధారణ కోర్సులకు ఏమాత్రం భిన్నమైనది కాకపోవడమేనని హెచ్ ఆర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే 2018 కి 2021 కి తేడా ఏంటన్న విషయం గూగుల్ ఇప్పటికీ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ముందు అమెరికాలో ఈ ప్రోగ్రాంకి కంపెనీలు ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఇస్తాయి. ఈ ప్రోగ్రాం ద్వారా నేర్చుకున్న విద్యార్థులు ఎంతగా స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటున్నారు వంటివి చూసి మన దేశంలో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రాం సరిగ్గా పనిచేస్తుందా లేదా? అని నిర్ణయించుకుంటామని చాలా కంపెనీలు వెల్లడిస్తున్నాయి.

Infosys: డిగ్రీ లేకపోయినా ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇన్ఫోసిస్‌లో 500 ఉద్యోగాలు

NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయ్యారా? 1145 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

ఈ కోర్సులు ప్రారంభమైనా సరే.. ఇంజినీరింగ్ డిగ్రీ ఇప్పటికీ ప్రధానమే.. టెక్నాలజీ సంస్థలు కేవలం వారి గ్లోబల్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను తీసుకుంటాయి. ఇందులో స్కిల్స్, అనుభవంతో పాటు క్వాలిఫికేషన్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ సర్టిఫికేషన్ల వల్ల స్కిల్స్ పెరిగి జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమో కానీ డిగ్రీలు లేకుండా కేవలం స్కిల్స్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసే పద్ధతైతే ఇప్పట్లో రాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. వెస్ట్రన్ దేశాల్లో టాలెంట్ కి కొదవ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలు ఆ గ్యాప్ ని నింపగలవు. కానీ మన దేశంలో ఉన్న ఉద్యోగాల కంటే ఎక్కువ మొత్తంలో ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారు. అందుకే ఇతర దేశాల్లో చదువు లేకపోయినా ఈ స్కిల్స్ ఆధారంగా ఉద్యోగంలోకి తీసుకునే పరిస్థితి ఉంటుందేమో కానీ మన దేశంలో ఆ పరిస్థితి ఇప్పట్లో వచ్చే అవకాశాలు ఉండవు. అయితే కాలేజీ విద్యార్థులకే ఈ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్పించే పద్ధతిని ప్రయత్నిస్తామని కొన్ని యూనివర్సిటీలు వెల్లడిస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published: