ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షను రేపు జనవరి 08, 2023న నిర్వహించనున్నారు. మొత్తం 92 పోస్టులకు ఈ నోటిఫికేసన్ విడుదల కాగా.. 1,26,499మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలో 297 పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్ 1(Group 1) పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష అనంతరం కేవలం మూడు వారాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇదిలా ఉంగా.. మొత్తం 92 పోస్టులకు విడుదలైన ఈ గ్రూప్ 1 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులు కలిపారు. 2018లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లోని 167 పోస్టుల్లో 19 మంది జాయిన్ అవ్వలేదు. ఆ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ కు జత చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి కొన్ని అంశాలు న్యాయస్థానం విచారణలో ఉన్నందున కోర్టు తుది తీర్పునకు లోబడి వీటిని భర్తీ చేస్తామని APPSC పేర్కొంది. కొత్తగా జత చేసిన 19 పోస్టుల్లో 2 పోస్టులు మిగలగా.. 17 పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అవ్వలేదు.
ఇక రేపు జరగబోయే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పగౌతమ్ సవాంగ్ తెలిపారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు. ఈ నెలలోనే గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే గ్రూప్ 2 పరీక్ష విధానంలో మార్పులు చేపట్టారు. అంతక ముందు మెయిన్స్ కు మూడు పేపర్లు ఉండగా.. వాటికి రెండు పేపర్లకు కుదించారు. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. వీటితో పాటు.. గెజిటెడ్ , నాన్ గెజిటెడ్ , గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారు.
మొత్తం 13 రకాలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. జీతం..రూ. 57, 100 నుంచి రూ. 1,51,370 మధ్య చెల్లించనున్నారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..
1. డిప్యూటీ కలెక్టర్ - 10
2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12
3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13
4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02
5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02
6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08
7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02
08. MPDO - 07
09. జిల్లా రిజిస్ట్రార్స్ - 03
10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01
11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02
12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06
13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, APPSC, JOBS