APPSC Group1: గ్రూప్1 మెయిన్స్ పరీక్ష వాయిదా.. ఏపీపీఎస్సీకి హైకోర్టు కీలక ఆదేశాలు

APPSC Logo

APPSC Group1: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష‌ విషయంలో షాక్ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో తప్పులున్నాయన్న అభ్యర్థుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో షాక్ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో తప్పులున్నాయన్న అభ్యర్థుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఆ తప్పులను తొలగించి మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టును ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలను తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రంలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కోర్టుకు వివరించారు. అభ్యర్థుల తరపున వాదించిన న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.

    ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన ప్రైమరీ కీ లో తప్పులున్నాయంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీపీఎస్సీ ప్రాథమిక కీ నిపుణుల కమిటీని వేసింది. ప్రాథమిక కీ ని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీ ని విడుదల చేసింది. అయితే అందులో సైతం తప్పులు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు.

    అయితే ఫైనల్ కీని సైతం నిపుణల కమిటీ విడుదల చేసింది. అయితే ఆ కీలో కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ వారంతా కోర్టులో పిటీషన్ దాఖాలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. నవంబర్ 2న మెయిన్స్ ను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published: