గ్లోబల్ వార్మింగ్(Global Warming), చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం(Air Pollution) పెరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2022 జరుగుతోంది. బెంగళూరులో(Bangalore) నాలుగు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. దేశంలోని కొందరు నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశంలో వాయు కాలుష్య స్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. రాబోయే సంవత్సరాల్లో గాలి నాణ్యత నియంత్రణ అంశం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అలాగే రానున్న కొన్నేళ్లలో ఈ రంగాల్లో దాదాపు పది లక్షల ఉద్యోగాలు(10 Lacks Jobs) అందుబాటులోకి రానున్నాయన్న అభిప్రాయాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దేశంలోని పది లక్షల ఉద్యోగాల్లో మహారాష్ట్రలో 20 నుంచి 40 వేల ఉద్యోగాలు లభించవచ్చని అంచనా. “భారతదేశంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విభాగంలో దాదాపు పది లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో శిక్షణ ప్రారంభించవచ్చు. మహారాష్ట్రలో ఐఐటీ ముంబై ఇందుకు చొరవ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యాసంస్థల్లోనూ దీన్ని ప్రారంభించవచ్చు’’ అని ఐఐటీ కాన్పూర్ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ ప్రొ. ఎస్ఎన్ త్రిపాఠి అన్నారు. పెద్ద పారిశ్రామిక రంగాన్ని కలిగి ఉన్న మహారాష్ట్ర, దేశంలో అత్యధిక సంఖ్యలో నాన్-ఎటైన్మెంట్ సిటీలను (నిర్దేశిత స్థాయి కంటే ఎక్కువ వాయు కాలుష్యం ఉన్న నగరాలు) కలిగి ఉంది.
ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని సదస్సులో పాల్గొన్న నిపుణులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై పోరాటాన్ని స్వల్పకాలిక చర్యలకు మాత్రమే పరిమితం చేయకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని నిపుణులు చెప్పారు.
ప్రస్తుతం భారతదేశంలో సమగ్ర వాయు నాణ్యత ప్రమాణాలను పెంచేవిధంగా తీసుకునే కార్యాచరణ నలాంటి కార్యక్రమం లేదు. ఇది మాత్రమే కాదు.. గాలి నాణ్యత కోసం పూర్తి శిక్షణ పొందిన విద్యా రంగం కూడా తమకు లేదు. అందువల్ల "విద్య, సాంకేతికత మరియు ఆరోగ్య రంగాలలో ఈ ఉద్యోగాలను అభివృద్ధి చేయడం వలన జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ రెండవ దశలో ముందుకు సాగడానికి గణనీయంగా సహాయపడుతుంది" అని ప్రొఫెసర్ త్రిపాఠి పేర్కొన్నారు.
అలాగే, ‘‘మహారాష్ట్ర దేశానికి ఆర్థిక రాజధాని. చర్యల అమలు, సామాజిక-ఆర్థిక సవాళ్ల నిర్వహణ, పరిపాలనా నిర్మాణం వంటి అనేక అంశాల్లో మహారాష్ట్ర నాయకత్వ పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు'' అని సెంటర్ ఫర్ వాయు కాలుష్య అధ్యయనాల (CAPS) హెడ్, డా. ప్రతిమా సింగ్ అన్నారు. దీని కారణంగా.. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉంటాయని.. దీని కోసం యువత సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Inter jobs, JOBS, Private Jobs