కరోనా(Corona) వ్యాప్తి గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడుతున్న వేళ వ్యాపారాలు(Business) 2020కి ముందు నాటి స్థాయిలో తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్(United States), యూరప్ కొన్ని దేశాలలో కొత్త ఉద్యమం మొదలైంది. అనూహ్య సంఖ్యలో ప్రజలు "యాంటీవర్క్" (antiwork) ని ఒక మతంలా పాటించడం ప్రారంభించారు. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) ప్రకారం, ఆగస్టులో రికార్డు స్థాయిలో 4.3 మిలియన్ల మంది రాజీనామా(Resignation) చేశారు. జూలై నుంచి 2,42,000 మంది ఉద్యోగులు తమ కొలువులను(Jobs) వీడారు. అత్యధిక నిరుద్యోగిత రేటు (Unemployment Rate) నమోదైన ఒక ఏడాది తర్వాత యూఎస్ లో ఉద్యోగుల (Employees) నిష్క్రమణ రేటు కూడా పెరిగిపోయింది. ఒక నెలలో కొలువులను వీడిన వారి సంఖ్య 2.9 శాతానికి పెరిగిందని బ్యూరో జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సమ్మరీ నివేదించింది. అమెరికన్ సైకాలజిస్ట్ ఆంథోనీ క్లోట్జ్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వీడడాన్ని "గ్రేట్ రిజిగ్నేషన్" అని అభివర్ణించారు. ఇది వర్క్ లైఫ్ గురించి ప్రతి ఒక్కరికి ఎంతో విలువైన పాఠాలు నేర్పించిందన్నారు. కరోనా వల్ల ఉద్యోగులు ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఎందుకు జాబ్స్ ను వదిలేస్తున్నారు? తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కోవిడ్ నేర్పిన పాఠాలు
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో చాలా మంది పని భారం లేని జీవనాన్ని సాగించారు. ఆ కాలంలో ఉద్యోగులు తమ తక్కువ వేతనం, అర్థం పర్థం లేని డెడ్ లైన్స్, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఉన్నతాధికారుల గురించి గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యాయి. 2013 నుంచి ఉనికిలో ఉన్న Reddit ఫోరమ్ “r/antiwork” లో గత సంవత్సరంలోనే 920,000 మంది ఫాలోవర్స్ చేరారు. రోజూ సగటున 1,400 కంటే ఎక్కువ పోస్ట్‌లు ఇందులో కనిపించాయి. ఈ పోస్ట్‌లలో తమ ఉద్యోగ జీవితం నరకంలా ఉందని చాలా మంది ఉద్యోగులు అందరితో పంచుకున్నారు.
TSPSC-CM KCR: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో వారి వయో పరిమితి, రిజర్వేషన్లు పెంపు..
ఎవరు, ఎందుకు జాబుల నుంచి నిష్క్రమిస్తున్నారు?
రిటైల్, హాస్పిటాలిటీ రంగాలలోని ఉద్యోగులు జాబ్స్ నుంచి వైదొలగుతున్నప్పటికీ, చాలా మంది ఉద్యోగాలను మార్చడానికి లేదా వారి ఎంపికలను తిరిగి సమీక్షించడానికి సిద్ధంగా ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆగస్ట్‌లో అకామిడేషన్, ఫుడ్ సేవలలో 157,000కి పైగా.. టోకు వ్యాపారం/ హోల్ సేల్ ట్రేడ్ లో 26,000కి పైగా.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ విద్యలో 25,000కి పైగా ఉద్యోగులు తమ కొలువుల నుంచి తప్పుకున్నారు.
భారత్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
భారతదేశంలోని జాబ్ మార్కెట్ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ కంపెనీ లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ.. సామాజిక భద్రత, నిరుద్యోగ భృతి లేకపోవడం వల్ల ఉద్యోగాల వదిలిపెట్టి బయటికి వెళ్లే విలాసం భారతదేశంలో చాలా మందికి అందుబాటులో లేదన్నారు. కాకపోతే కార్పోరేట్ సంస్థలు ఉద్యోగులకు సౌకర్యవంతమైన వర్క్ లైఫ్ అందించడానికి టైర్ II, III పట్టణాలలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
TCS Recruitment 2021 : ఎంబీఏ చేసిన వారికి బెస్ట్ కెరీర్ ఆప్షన్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు
అధిక వలసల కారణంగా ఇప్పుడు విస్తరణలు ఉన్నాయని చెప్పారు. ఇండియాలో అధిక మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారుతున్నారన్నారు. చాలా మంది నిపుణులు ఉద్యోగాలు మారడంతో ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో గందరగోళం కనిపిస్తోందన్నారు. కరోనా తర్వాత రాజీనామాల విషయంలో మార్పులు రాకపోయినా ఇతర అంశాల్లో మార్పు రావచ్చన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, JOBS, Private Jobs, Unemployment, United states