హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Regional Languages: ఇంగ్లీష్ రాకున్నా ఓకే.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

Regional Languages: ఇంగ్లీష్ రాకున్నా ఓకే.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

Regional Languages: ఇంగ్లీష్ రాకున్నా ఓకే.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

Regional Languages: ఇంగ్లీష్ రాకున్నా ఓకే.. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

Regional Languages: ఉద్యోగ అవసరాలకు ఇంగ్లీష్ తెలియడం తప్పనిసరి కావడంతో ఎలాగైనా ఈ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంత మాతృభాష వస్తే చాలు.. వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయని, వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా సార్లు మనం మనసులో అనుకున్న భావాన్ని ఇంగ్లీష్‌ (English)లో చెప్పడానికి ప్రయత్నించి విఫలమవుతుంటాం. మన సొంత మాతృ భాషలో చెప్పినంత స్పష్టంగా ఇతర భాషలో ఆ భావాన్ని వివరించలేకపోతాం. అందుకు ప్రధాన కారణం ఆ భాష మనకు రాకపోవడం. అదే మన మాతృభాష అయితే మాత్రం చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా విషయాన్ని వివరించగలుగుతాం. కానీ ఉద్యోగ అవసరాలకు ఇంగ్లీష్ తెలియడం తప్పనిసరి కావడంతో ఎలాగైనా ఈ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంత మాతృభాష వస్తే చాలు.. వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయని, వారికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

* జాబ్ మార్కెట్‌లో కీలక మార్పులు

దశాబ్ద కాలంలో ఇండియన్ జాబ్ మార్కెట్‌లో గణనీయ మార్పులు జరిగాయి. గత ఐదేళ్లలో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో ఆన్‌లైన్‌లోనే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. పరిశ్రమలలో డిజిటలైజేషన్ క్రమంగా పెరిగింది. ఇంటర్నెట్‌లో స్థానిక భాషల వాడకం కూడా పెరిగింది. ఫలితంగా చాలా మంది స్థానిక భాషల్లో ఆన్‌లైన్‌లోనే ఉద్యోగాలు పొందుతుండటం విశేషం.

* ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యం

భారతదేశంలో ప్రస్తుతం 12.5 కోట్లమంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని, అయితే ఇందులో మూడు లక్షల మంది మాత్రమే ఈ భాషను ఫస్ట్ లాంగ్వేజ్‌గా యూజ్ చేస్తున్నారని కేపీఎంజీ (KPMG) రిపోర్ట్ తేల్చింది. 22 ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకే ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని నివేదిక పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 55 శాతం జనాభా హిందీ భాషను తమ ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజ్‌గా చెబుతున్నారు. బిజినెస్ వరల్డ్, కార్పొరేట్ జాబ్స్‌లో మాత్రం ఇంగ్లీష్ భాషకే ప్రయారిటీ ఉంది.

ఒకప్పటితో పోలిస్తే ఇండియాలో ఉద్యోగ అవకాశాల పరిస్థితి బాగా మెరుగైంది. ఉద్యోగార్థులు ఇతర భాషల్లో కంటే తమ మాతృభాషలో తమ వివరాలు చెప్పడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో జాబ్ సెర్చ్‌ను సులభతరం చేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. నియామకాలు జోరుగా కొనసాగుతున్న క్రమంలో పద్ధతులు కచ్చితంగా సమీప భవిష్యత్తులో మారనున్నాయి. ఫలితంగా కంపెనీలు, ఉద్యోగార్థులు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

* ఇంగ్లీష్ రాకున్నా అవకాశాలు

ప్రస్తుతం ఉపాధి కల్పనలో ప్రాంతీయ భాష కీలకంగా మారింది. పని చేయడానికి కావాల్సిన ప్రాథమిక నైపుణ్యం ఉండి, ప్రాంతీయ భాషల్లో మాట్లాడగలిగిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ-కామర్స్, కన్‌స్ట్రక్షన్, లాజిస్టిక్స్, రిపేర్&మెయింటెనెన్స్, రిటైల్ సెక్టార్స్‌లో ఉపాధి లభిస్తుంది. ఈ రంగాల్లో పని చేసే వారికి ఇంగ్లీష్ రాకున్నా పెద్ద ఇబ్బందులేమీ ఉండబోవు. కోవిడ్ పాండమిక్ తర్వాత సంస్థలు రిమోట్ వర్క్‌కు అవకాశాలు ఇస్తున్నాయి. అలా ప్రతిభ ఉన్న వారికి భాషతో సంబంధం లేకుండా అవకాశాలు ఇచ్చేందుకు సంస్థలు ప్రాధాన్యతనిస్తున్నాయి.

(Written by- Saumitra Chand, Career Expert, Indeed)

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, English medium, JOBS, Telugu language

ఉత్తమ కథలు