గుర్గావ్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Great Lakes Institute).. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు (Post Graduate Diploma Course)ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రైవేట్ బిజినెస్ స్కూల్ (Business School) ఆన్‌లైన్ ఫార్మాట్‌లో ఈ కోర్సును అందించనుంది. ఈ సంవత్సరం గుర్గావ్ క్యాంపస్‌లో కొత్తగా కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సు లెర్నర్స్‌కు బిజినెస్ ఫండమెంటల్స్‌పై బలమైన అవగాహన కల్పిస్తుందని, తద్వారా వారిని మ్యానజీరియల్ రోల్స్‌లోకి మార్చి కెరీర్ గ్రోత్‌ను వేగవంతం చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన బెస్ట్ టాపిక్స్, వినూత్న బోధనలతో లెర్నర్స్ కొత్త విషయాలను సమగ్రంగా నేర్చుకునేలా ఈ కోర్సును డిజైన్ చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
ఫ్లెక్సిబుల్ ఆన్‌లైన్ లెర్నింగ్ ఫార్మాట్‌లో డెలివరీ కానున్న ఈ PGDM కోర్సు, పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాలతో లెర్నర్స్‌కు న్యూ-ఏజ్ స్కిల్స్ పెంపొందించడంతోపాటు కోర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సూత్రాలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. డేటా సైన్స్ & అనలిటిక్స్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ వంటి డొమైన్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌ను ఎంచుకోవడం ద్వారా లెర్నర్స్ మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది.
మెంటార్ లెర్నింగ్ ద్వారా ఫ్యూచర్- రెడీ కాన్సెప్ట్స్ పొందేందుకు, లెర్నర్స్ అవసరాలకు అనుగుణంగా కోర్సు టాపిక్స్ ఉంటాయి. లైవ్ వర్చువల్ క్లాస్‌రూమ్స్, రికార్డ్ లెక్చర్ వీడియోస్ & స్టడీ మెటీరియల్స్, డిస్కషన్ ఫోరమ్స్ అండ్ కేస్-బేస్డ్ లెర్నింగ్స్ కలయిక ద్వారా నిపుణుల మార్గదర్శకత్వంలో లెర్నర్స్ అత్యాధునిక ఆన్‌లైన్ లెర్నింగ్‌లో పాల్గొనవచ్చని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
ఈ సందర్భంగా గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ మోహన్ లఖంరాజు మాట్లాడుతూ.. ‘ఏఐసీటీఈ ఆమోదించిన గ్రేట్ లేక్స్ ఆన్‌లైన్ పీజీడీఎమ్‌ని పరిచయం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తుకు తగిన నైపుణ్యాలను పొందడంలో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు చేస్తూనే, కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకునే వేలాది మంది ప్రొఫెషనల్స్‌కు సహాయం చేయడంలో ఈ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషిస్తుంది.’ అని తెలిపారు.
డెడికేటెడ్ కెరీర్ సపోర్ట్ కోసం అభ్యర్థులు బైజూస్ గ్రూప్‌లో భాగమైన గ్రేట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ యాక్సెస్ కూడా పొందనున్నారు. ఇ-పోర్ట్‌ఫోలియోను క్రియేట్ చేయడంలో సహాయం చేయడం, ఇంటర్వ్యూలు & రెజ్యూమ్ బిల్డింగ్ కోసం ప్రిపరేషన్, ఎక్స్‌క్లూజివ్ జాబ్ బోర్డులకు యాక్సెస్, కెరీర్ గైడెన్స్ అండ్ మెంటార్‌షిప్ వంటివి ఇందులో ఉంటాయి.
మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఐఐఎం లక్నో (IIM Lucknow) 6 నెలల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (Executive programme)ను తాజాగా లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కృత్రిమ మేధ (AI)లో అందించే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను 2-3 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల కోసం రూపొందించింది. WileyNXTతో కలిసి ఈ సర్టిఫికేట్ కోర్సును పరిచయం చేసింది. AI ప్రొడక్ట్స్, సేవలు అభివృద్ధి చేయడం లేదా ప్రాసెస్‌ల కోసం డేటాను పెంచాలనుకునే నిపుణులకు ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. WileyNXT సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు IIM లక్నో నుంచి సర్టిఫికేట్ అందుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Online course