GRAMSEVAKS JOBS JOBS IN A LEADING COMPANY READY TO GIVE JOBS TO 10 LAKH UNEMPLOYED FULL DETAILS HERE GH VB
GramSevaks Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. 10 లక్షల మందికి జాబ్స్.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ మహాగ్రామ్ (Mahagram) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తన సిటిజన్ సర్వీస్ డెలివరీ ఈ-పోర్టల్ కోసం 10 లక్షల మంది నిరుద్యోగ యువతను 'గ్రామ్‌సేవక్ (GramSevaks)'లుగా నియమించుకునేందుకు సిద్ధమయ్యింది.
ప్రముఖ ఫిన్‌టెక్(Fintech) కంపెనీ మహాగ్రామ్ (Mahagram) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇది తన సిటిజన్ సర్వీస్ డెలివరీ ఈ-పోర్టల్(E Portal) కోసం 10 లక్షల మంది నిరుద్యోగ యువతను 'గ్రామ్‌సేవక్ (GramSevaks)'లుగా నియమించుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ ఫిన్‌టెక్ కంపెనీ కొత్తగా గ్రామసేవక్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1 మిలియన్ నిరుద్యోగ యువతను నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ బేసిక్ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ & ఈ-గవర్నెన్స్ సేవలను అందించడానికి కంపెనీ ఇటీవలే 'GramSevak.com' అనే సిటిజన్ సర్వీస్ డెలివరీ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇది ఏకంగా పది లక్షల మందిని హైర్ చేసుకుంటామని ప్రకటించడంతో నిరుద్యోగులకు తీపి కబురు అందించినట్లయింది.
మహాగ్రామ్ కంపెనీ ప్రకారం, ‘మహాగ్రామ్ సేవక్ (Mahagram Sevak)’ అని పిలిచే డిజిటల్-ఎనేబుల్డ్ ఫుట్-ఆన్-స్ట్రీట్ ప్రతినిధుల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుతాయి. ఈ మహాగ్రామ సేవకులు పోర్టల్ ద్వారా అందించే సేవలకు కమీషన్‌ను సంపాదిస్తారని కంపెనీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ప్రోగ్రాం గురించి మహాగ్రామ్ సీఈఓ రామ్ శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న గ్రామసేవకులందరికీ గ్రామసేవక్.కామ్ పోర్టల్ ద్వారా కమీషన్ రూపంలో మనీ ఇస్తామని చెప్పారు. ఇండియన్ సిటిజన్లు స్థానిక గ్రామసేవక్ ప్రతినిధుల మద్దతుతో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్, బీమా సేవలను యాక్సెస్ చేయడానికి GramSevak.com ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవచ్చు. మహాగ్రామ్ దాదాపు 1 మిలియన్ నిరుద్యోగ యువతను గ్రామసేవక్ ప్రాజెక్ట్ కింద నమోదు చేయాలని భావిస్తోంది, ఇది వారికి మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఈ ప్రోగ్రాం భారతదేశంలోని గ్రామీణ మహిళలపై దృష్టి సారించడం ద్వారా సగటు ఇంటి పొదుపును పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
GramSevak.com పోర్టల్ గ్రామీణ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. సాంకేతిక లేదా ఆర్థిక పరిజ్ఞానం లేనప్పటికీ ఇండియన్ పౌరులు ఈ సేవలను పొందవచ్చు. మేం 300 మిలియన్ల అన్‌బ్యాంకింగ్ సిటిజన్లను ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ తెలిపింది. ఈ సంస్థ సేవలు పట్టణ, గ్రామీణ ప్రజలకు అందుతాయి. ఫిన్‌టెక్ కంపెనీ మహాగ్రామ్ తమ ఫిన్‌టెక్ సొల్యూషన్ల ద్వారా మూలలో ఉన్న మామ్-అండ్-పాప్ స్టోర్ నుంచి బ్యాంకింగ్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. గ్రామీణ మహిళలు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కి మైళ్ల దూరం ప్రయాణించే బదులు స్థానిక కిరానా స్టోర్లలో డబ్బు ఆదా చేసుకునేలా చేయడం తమ కంపెనీ లక్ష్యమని సీఈఓ రామ్ శ్రీరామ్ అన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.