హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఎస్ఎస్‌సీ బోర్డు కీలక నిర్ణయం..

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఎస్ఎస్‌సీ బోర్డు కీలక నిర్ణయం..

వారిని కూడా పరీక్షలు లేకుండా పాస్‌చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

వారిని కూడా పరీక్షలు లేకుండా పాస్‌చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఎస్ఎస్‌సీ బోర్డు పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా వేశారు. రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పట్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించే పరిస్థితులు కానరావడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ గ్రేడ్లు ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులేనని.. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. www.bse.telangana.gov.in వెబ్ సైట్‌లో విద్యార్థులు వివరాలు చూసుకోవాలని వెల్లడించారు. గ్రేడ్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్‌సీ బోర్డు దృష్టికి తీసుకురావాలని కోరారు.

First published:

Tags: EDUCATION, Ssc exams, Telangana

ఉత్తమ కథలు