హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Foreign Universities: త్వరలో భారత్‌కు విదేశీ యూనివర్సిటీలు.. యూజీసీ తాజా మార్గదర్శకాలు ఇవే..

Foreign Universities: త్వరలో భారత్‌కు విదేశీ యూనివర్సిటీలు.. యూజీసీ తాజా మార్గదర్శకాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేవలం చదువుకోవడానికి మాత్రమే విదేశాలకు వెళ్లే వారికి ఒక పెద్ద శుభవార్త. ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుల కోసం ఇక భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్లనవసరం లేదు. ఎందుకంటే విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్‌లో తమ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

కేవలం చదువుకోవడానికి మాత్రమే విదేశాలకు వెళ్లే వారికి ఒక పెద్ద శుభవార్త. ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుల కోసం ఇక భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్లనవసరం లేదు. ఎందుకంటే విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్‌లో(India) తమ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌లో విదేశీ యూనివర్సిటీల(Universities) కార్యకలాపాలపై గతంలో పార్లమెంటులో అనేక చర్చలు జరిగాయి. ఇక త్వరలోనే ఫారిన్ చదువులు భారత్‌లోనే అందుబాటులోకి రానున్నాయి.

ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్‌లో విద్యను మరింత ఆధునీకరించాలని నిర్ణయించుకుంది. కేంద్రం భారత్‌లోనే విదేశీ విద్యను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కేవలం విదేశీ యూనివర్సిటీలు అందించే విద్యను చదువుకోవడానికి మాత్రమే ఏటా భారత్‌ నుంచి అనేక మంది విద్యార్థులు ఇతర దేశాలకు తరలివెళ్తున్నారు. ఇది వారికి ఆర్థికంగా భారమవడమే కాకుండా కరెన్సీ మారకంలో ఇతర దేశాలే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* ప్రత్యేక చట్టం

భారత్‌లో విదేశీ యూనివర్సిటీలకు ఆహ్వానంపై కేంద్రం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. దీనిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని యూజీసీ ద్వారా జనవరి 5న బయటకు రిలీజ్ చేశారు. తాజాగా రూపొందించిన డ్రాఫ్ట్‌ ప్రకారం.. భారత్‌లో ఇప్పటి వరకు విదేశీ విద్యను అందించిన విద్యా సంస్థలే వీటి అడ్మిషన్లు, ఫీజులు, స్కాలర్‌షిప్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటాయి.

యూనివర్సిటీలకు ఈ ఫారిన్ విద్యా సంస్థలపై పూర్తి అధికారం ఉంటుంది. క్లాస్ రూముల్లోనే నేరుగా విద్యార్థులకు ఈ విదేశీ విద్యా కోర్సులను బోధించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ కోర్సులకు, డిస్టెన్స్ లెర్నింగ్‌ను అనమతించరు. యూజీసీ అనుమతి తీసుకొని మాత్రమే భారత్‌లో విదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఆ విదేశీ విద్యా సంస్థలు తమ పర్మిషన్లను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని యూజీసీ చైర్మన్ ఎమ్. జగదీష్ కుమార్ తెలిపారు.

APPSC Group 1 Key Released: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ విడుదల.. గ్రూప్ 2పై అప్ డేట్..

ఎంట్రీకి 49 ఫారిన్ యూనివర్సిటీలు రెడీ

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ యేల్, ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలు కూడా భారత్‌లో తమ విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే 49 విదీశీ విద్యాసంస్థలు భారత్‌లో కోర్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. యూనివర్సిటీలతో కలిసి పనిచేయడానికి కూడా తాము రెడీగా ఉన్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో త్వరలోనే భారత్‌లో విదేశీ యూనివర్సిటీలు ఎంట్రీ ఇస్తాయి. ఇక మెడిసిన్ కోసం చైనాకు, ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లనవసరం ఉండకపోవచ్చు.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థపై నిపుణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బట్టీ చదువుల వల్ల నైపుణ్యం కొరవడుతోందని అంటున్నారు. భారత్ విద్యావిధానాన్ని ఇప్పటికైనా మార్చవలసిన అవసరం ఉందంటున్నారు. 2022 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో 133 దేశాల్లో భారత్ 101వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్, మార్కెట్‌ను బట్టి విద్యా విధానం మారాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, UGC

ఉత్తమ కథలు