Apprenticeship Act: అప్రెంటిస్​ చట్టంలో మార్పులకు కేంద్రం కసరత్తు.. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో బిల్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వారికి అవకాశాలు మెరుగుపర్చేందుకు అప్రెంటిస్ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాబోయే పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో కొత్త అప్రెంటిస్‌షిప్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.

  • Share this:
యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వారికి అవకాశాలు మెరుగుపర్చేందుకు అప్రెంటిస్ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాబోయే పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో కొత్త అప్రెంటిస్‌షిప్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇలాంటి శిక్షణ పరిధిని మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ మార్పులపై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్​ డెవలప్​మెంట్​ అండ్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేబినెట్​లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. స్మాల్​ అండ్​ మైక్రో కంపెనీలు నైపుణ్యం గల యువతను నియమించుకునే విధంగా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నైపుణ్యం గల అప్రెంటిస్‌లను షేరింగ్ ప్రాతిపదికన నియమించటానికి ఈ బిల్లు అనుమతించే అవకాశం ఉంది. ఫలితంగా చిన్న, మధ్య తరహా సంస్థలు సైతం అప్రెంటిస్‌ బృందాలను నియమించుకోవచ్చు. వారికి స్టైఫండ్‌ను కూడా పంచుకోవచ్చు. ప్రాజెక్ట్​ వ్యవధి, అవసరాలను బట్టి అప్రెంటీస్​లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఏ సంస్థలోనైనా మొత్తం ఉద్యోగుల్లో 10% మించి అప్రెంటీస్​లను నియమించుకోరాదు.
7th Pay Commission: డీఏ హైక్ కన్నా ముందే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు
RIL 44th AGM: ఈ ఏడాది నుంచే జియో ఇనిస్ట్యూట్ కార్యకలాపాలు.. ప్రకటించిన నీతా అంబానీ.. ప్రత్యేకతలివే

అయితే కొత్త చట్టంలో ఈ నిబంధనను సడలించనున్నారు. ఇకపై సంస్థలు 15% వరకు అప్రెంటిస్‌లను నియమించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఫలితంగా ఆయా సంస్థలకు చెందిన మాన్యుఫాక్చరింగ్​ యూనిట్, షాప్ ఫ్లోర్, వెండర్స్​ సైట్ వంటి వర్క్​ లొకేషన్స్​లో అప్రెంటీస్​లను నియమించుకోవచ్చు. తద్వారా, కంపెనీల ఉత్పాదకత కూడా పెంచుతుంది. అంతేకాక, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతుంది. దీంతో, జీతభత్యాలకు అయ్యే ఖర్చులు తగ్గి యాజమాన్యాలు లాభాల బాట పడతాయి.

బడ్జెట్​లో రూ.3 వేల కోట్లు కేటాయింపు..
ఈ కొత్త చట్టంపై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో పనిచేసే ఒక అధికారి మాట్లాడుతూ ‘‘అప్రెంటిస్ షిప్ చట్టంలో మార్పులు చేయాలని యూనియన్ బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ఆరు నెలల్లోపు ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. కాగా, 2016లో నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టంలో చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్‌ ప్రసంగంలో అప్రెంటిషిప్​పై పలు కీలక విషయాలు వెల్లడించారు.

అప్రెంటిస్‌షిప్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 3,000 కోట్లు కేటాయించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. భారతీయ సంస్థలు అప్రెంటీస్​లను నియమించుకొని విదేశాల్లో సైతం వారిని ఉపయోగించుకునే వీలుంటుంది. అంతేకాదు, అవసరం మేరకు శిక్షణా సమయాన్ని కూడా పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది.
Published by:Nikhil Kumar S
First published: