డిగ్రీ విద్యార్హతతో హోదా , ఆకర్షణీయ వేతనం , సామాజిక బాధ్యత ఉన్న ఉద్యోగంగా ఎస్ఐ పోస్టుకు గ్రూప్స్ అని చెప్పుకోవచ్చు . అందువల్లే పోటీ ఎక్కువ . ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది . ఈ ఉద్యోగాలకు సంబంధించిన మొదటి అంకం- ప్రాథమిక పరీక్షలో విజయం సాధించడం . సన్నద్ధతను సరైన దిశలో కొనసాగిస్తే ఇందులో గట్టెక్కడం అందరికీ సాధ్యమే . ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకుని, ఒత్తిడి లేకుండా అధ్యయనం కొనసాగించినవారు ఎస్ఐ గ్రూప్స్ అవ్వాలనే కలను సాకారం చేసుకోవచ్చని సీనియర్ అర్థమేటిక్స్ ప్యాకల్టీ అశోక్ అంటున్నారు..
TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్.. అర్హతలు.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు
ఆ అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ముందుగా సిలబస్ పై అవగాహన.. పెంచుకోవాలి ఏ ఏ సిలబస్ నుండి ఏమి టాపిక్ వస్తాయి అనే దానిపై క్లారిటీ తెచ్చుకొని వాటిపై ద్రుష్టి సారించాలి. ఇక బుక్స్ విషయానికి వస్తే మార్కెట్లో సీనియర్స్ రాసినా బుక్స్ చదవాలి..అవికూడా తెలంగాణ ఎంబ్లమ్ వేసిన బుక్స్ చూసుకొని కొనుక్కోవాలి. నకిలీలు చాలా ఉంటాయి. కాబట్టి బుక్స్ విషయం లో కూడా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు. మనము తక్కువ సమయంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలంటే ముందుగా మనము ఒక ప్రణాళిక బద్దంగా టైం టేబుల్‌ను రాసి పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి.
ముందుగా కఠిన సబ్జెక్ట్స్ ను చదవడం ప్రారంభించాలి ఎగ్జామ్స్ టైం లోపు 3సార్లు రివైజ్డ్ చేసుకునేలా ఉండాలి.. ఎప్పుడు ఇవే కాకుండా ఈజీగా ఉండే సబ్జెక్ట్స్‌ను కూడా వీటితో పాటు ఎగ్జామ్స్ టైమ్స్ లోపు చదివిస్తే బాగుంటుంది. సబ్జెక్ట్ పై పట్టు రావాలంటే కఠినంగా ఉన్న టాపిక్స్‌కు కోడ్ లాంటివి పెట్టుకోవాలి.
Jobs in TS: డీఎంహెచ్ఓ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే చాన్స్
గతంలో ఉన్న మాడల్ పేపర్స్ తో పాటు ఇన్స్టిట్యూట్ లో చెప్పే అంశాలను ఒకటికి రెండు సార్లు చదివితే సబ్జెక్ట్ పై అవగాహనా పెంచుకోవచ్చు అని అంటున్నారు.ఎస్ ఐ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యావరికి కొన్ని సబ్జెక్ట్స్ కామన్ సిలబస్ ఉంటుంది (ఉదాహరణకు అర్థమేటిక్స్. రీజనింగ్, జనరల్ సైన్స్,సిలబస్ ఉంటుంది) ఒక్కో సబ్జెక్ట్స్ కు ఒక్కో నిపుణులు ఉంటారు. వారు చెప్పే విషయాలను సబ్జెక్టుల వారీగా చెప్పే వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే.. చదివేటప్పుడు సులభంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయాలు..ఇక కానిస్టేబుల్, ఎస్ఐ ఫిజికల్ టెస్టులకు సన్నద్ధం, ఐయ్యేవారు ఉదయం 5గంటల నుంచి ఈవెంట్స్ ను ప్రాక్టీస్ చేయాలి.. కొత్తవాళ్లు తప్పకుండ ఫిజికల్ ట్రైనర్ వద్ద జాగ్రత్తలు తీసుకోని.. రన్నింగ్, లాంగ్ జంప్ హైజంప్, ప్రాక్టీస్ చేయాలి.
TSPSC Group-1: గ్రూప్-1 పోస్టులకు విశేష స్పందన.. అప్లికేషన్ ప్రాసెస్‌లో ముఖ్యమైన వివరాలు
ముఖ్యంగా ఫిజికల్ ఈవెంట్స్ చేసేటప్పుడు.. ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి , ఫుడ్ కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న గుడ్లు, మొలకెత్తిన గింజలు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిజికల్ ట్రైనింగ్ చేయరాదని, నిపుణులు అంటున్నారు.
పోలీస్ జాబ్స్ కు సంబంధించి నిపుణుల ఏం చెబుతున్నారంటే అంటే, కోచింగ్ తీసుకునేవారు ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. గత మోడల్ పేపర్లు అన్నింటిని పలుమార్లు ప్రాక్టీస్ చేస్తుండాలి. అలాగే ఇన్స్టిట్యూట్లో చెప్పే మక్ టెస్ట్ పరీక్షలు రాయాలి.ఒక ప్రణాళికాబద్దంగా చదివితే తక్కువ టైంలో ఎక్కువ స్కోరు చేయవచ్చు నిపుణుల అభిప్రాయం.. చాలా మంది మ్యాథమెటిక్స్ ఎక్కువగా స్క్రోరు చేయలేకపోతున్నారు.. అలాంటి వారు మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్ లో బారువడ్డీ చక్రవడ్డీ,కాలము పని, కాలము దూరము, లాభాలు నష్టాలు, బొట్స్ మరియు స్ట్రీమ్స్, ఎవరిజస్, అలాంటి టాపిక్ లు చదివితే తప్పకుండా అర్థమెటిక్ లో అనుకున్న స్క్రోరు చేయవచ్చని నిపుణులు అంటున్నారు..
ఫైనల్ గ అప్లై చేసుకునే సమయంలో ఒకటీకి రెండు సార్లు చూస్తూ..పోస్టులకు అప్లై చేసుకోవాలి గ్రూప్స్ లో విభాగాలు ఉంటాయి.. ఇంకా పోలీస్ జాబ్స్ లోనూ సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ లాంటి విభాగాలు ఉంటాయి. ఏలాంటి తప్పులు లేకుండా చూసుకొని అప్లై చేస్తే సరిపోతుంది అంటున్నారు..
- శ్రీనివాస్, న్యూస్ 18తెలుగు, కరీంనగర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Job notification, Police jobs, Preparation, Telangana police jobs, Ts jobs, TSPSC