GOVT JOBS PREPARATION ARE YOU PREPARING FOR GROUP JOBS AND SI THEN FOLLOW THESE TIPS EVK
Govt Jobs Preparation: ఎస్సై, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
(ఫ్రతీకాత్మక చిత్రం)
Govt Jobs Preparation | డిగ్రీ విద్యార్హతతో హోదా , ఆకర్షణీయ వేతనం , సామాజిక బాధ్యత ఉన్న ఉద్యోగంగా ఎస్ఐ పోస్టుకు గ్రూప్స్ అని చెప్పుకోవచ్చు . అందువల్లే పోటీ ఎక్కువ . ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది . ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన టిప్స్.
డిగ్రీ విద్యార్హతతో హోదా , ఆకర్షణీయ వేతనం , సామాజిక బాధ్యత ఉన్న ఉద్యోగంగా ఎస్ఐ పోస్టుకు గ్రూప్స్ అని చెప్పుకోవచ్చు . అందువల్లే పోటీ ఎక్కువ . ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది . ఈ ఉద్యోగాలకు సంబంధించిన మొదటి అంకం- ప్రాథమిక పరీక్షలో విజయం సాధించడం . సన్నద్ధతను సరైన దిశలో కొనసాగిస్తే ఇందులో గట్టెక్కడం అందరికీ సాధ్యమే . ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకుని, ఒత్తిడి లేకుండా అధ్యయనం కొనసాగించినవారు ఎస్ఐ గ్రూప్స్ అవ్వాలనే కలను సాకారం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన ప్రిపరేషన్ టిప్స్..
ప్రిపరేషన్ టిప్స్
- కరెంట్ ఎఫైర్స్ కోసం ఇంగ్లీష్, తెలుగు దినపత్రిక చదవాలి.
- జాతీయ, అంతర్జాతీయ అంశాలపై నోట్స్ తయారు చేసుకోవాలి.
- తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాబట్టి.. వాటిని ప్రిపేర్ అవ్వాలి.
- సరైన సమాచారంతో నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవాలి.
- ప్రివియస్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- మోడల్ పేపర్ కచ్చితంగా నేర్చుకోవాలి.
- ప్రిపరేషన్‌లో టైం టేబుల్ ఫాలో అవ్వాలి.
పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవారు...
- యోగాసనాలు(Yoga), ప్రాణాయామం, అనులోమ, విలోమ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు మెదడుకు మేతనిచ్చే మనసు ప్రశాంతంగా ఉంచే యోగాసనాలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
- అభ్యర్థులు ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, వాకింగ్, రన్నింగ్, తప్పకుండా చేయాలి.
గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు..
తెలుగు అకాడమీతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల నిపుణులతో పుస్తకాలు రూపొందించారన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ రాసిన పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఇటీవల అభ్యర్థులకు సూచించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఈ ఏడేళ్లలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలని వివరించారు. తెలంగాణ బడ్జెట్, ఆవిర్భావం తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడం లాంటి అంశాలు, కారణాల గురించి తెలుసుకోవాలన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.