GOVT Jobs : త్వరలో 17 వేల పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల నియామకం

GOVT Jobs | ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి, కొత్తగా చేరేవారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులనూ నియమించే యోచనలో ఉంది.

news18-telugu
Updated: June 30, 2019, 5:47 PM IST
GOVT Jobs : త్వరలో 17 వేల పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల నియామకం
త్వరలోనే 17వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
news18-telugu
Updated: June 30, 2019, 5:47 PM IST
రాష్ట్రంలో త్వరలోనే దాదాపు 17వేల మంది పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి, కొత్తగా చేరేవారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులనూ నియమించే యోచనలో ఉంది.

పంచాయతీరాజ్ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతంపనిచేస్తున్న వారు కాకుండా ప్రతి 500 జనాభాకు ఒకరుచొప్పున లెక్కిస్తే దాదాపు 17వేల మంది పారిశుద్ధ్య కార్మికులు అదనంగా అవసరం.. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా.. ఇప్పటికే వేతనాలు పెంచాలని అధికారులు భావించడంతో.. దీనికనుగుణంగానే నెలకు రూ.8,500 చొప్పున ఇచ్చేలా పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేతనం పెంచుతున్నందున వీరి పేరును ‘బహుళ ప్రయోజన పనివారిగా’ మార్పు చేసి గ్రామాల్లో పన్నుల వసూళ్లు తదితర పనులకూ ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...