• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GOVT JOBS LATEST JOB NOTIFICATION IN DEPARTMENT OF MEDICAL HEALTH CHECK HERE DETAILS RA

GOVT Jobs : వైద్య ఆరోగ్యశాఖలో 3,175 పోస్టులు.. భర్తీకి అధికారుల ఏర్పాట్లు..

GOVT Jobs : వైద్య ఆరోగ్యశాఖలో 3,175 పోస్టులు.. భర్తీకి అధికారుల ఏర్పాట్లు..

వైద్య ఆరోగ్యశాఖలో 3,175 ఉద్యోగాలు

GOVT Jobs | త్వరలోనే మరికొన్ని పోస్టులకుకూడా సీఎం కేసీఆర్ ఆమోదముద్ర పడనుందని వైద్యవర్గాలు తెలిపాయి. నల్గొండ,సూర్యాపేటల్లో వైద్య కాలేజీలు ఈసారే అందుబాటులోకి రానుండడతో త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Share this:
    త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 3,175 పోస్టుల భర్తీ చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఇందులో 2,196 నర్సులు,పారామెడికల్, ఇతర పోస్టులు కాగా.. వైద్యుల పోస్టులు 980 ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంఆస్పత్రుల్లో ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్‌వై) కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ పోస్టుల మంజూరుకు రంగం సిద్ధమైంది. వీటిల్లో 797 కొత్త పోస్టులను మంజూరు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే మరికొన్ని పోస్టులకుకూడా సీఎం కేసీఆర్ ఆమోదముద్ర పడనుందని వైద్యవర్గాలు తెలిపాయి. నల్గొండ,సూర్యాపేటల్లో వైద్య కాలేజీలు ఈసారే అందుబాటులోకి రానుండడతో త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    కొత్త పోస్టుల వివరాలు ఇవే..
    సూర్యాపేట కాలేజీ లేదా హాస్పిటల్‌లో వైద్యులు 398 పోస్టులు.. పారామెడికల్, ఇతర సిబ్బంది 791 మంది ..
    నల్గొండ కాలేజీ లేదా హాస్పిటల్‌లో వైద్యుల పోస్టులు 398 కాగా.. పారామెడికల్, ఇతర సిబ్బంది పోస్టులు 791 మంది
    పీఎంఎస్ఎస్‌వై విభాగం కింద వైద్యులు 184మంది.. పారామెడికల్, ఇతర సిబ్బంది 613 మంది అవసరం..
    ఈపోస్టులనుకలుపుకుని 3, 175 అవుతున్నాయి.
    Published by:Amala Ravula
    First published: