హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Teaching-Non Teaching Posts: టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..

Teaching-Non Teaching Posts: టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..

Teaching-Non Teaching Posts: టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..

Teaching-Non Teaching Posts: టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..

Teaching-Non Teaching Posts: భగత్ ఫూల్ సింగ్ మహిళా విశ్వవిద్యాలయ (BPSMV) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

భగత్ ఫూల్ సింగ్ మహిళా విశ్వవిద్యాలయ (BPSMV) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bpsmv.ac.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లోపేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్ మరియు లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / బిఫార్మా / పిహెచ్‌డి డిగ్రీ మరియు ఇతర నిర్ణీత అర్హతలను కలిగి ఉండాలి. అంతే కాకుండా.. అభ్యర్థికి సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ / ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్లు వెరిఫై చేయబడతాయి. అభ్యర్థులకు రాతపరీక్షకు, ఇంటర్వ్యూకు సబంధించి ఎలాంటి టీఏ,డీఏ చెల్లించబడదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆ పోస్టును బట్టి నెలకు రూ.53,100 నుంచి రూ.1,82,400 వరకు జీతం ఇస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేయండి..

Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాలి.

Step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో కనిపించే సంబంధిత నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: ఇప్పుడు అభ్యర్థులు కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 4: ఆపై మీ అభ్యర్థి IDని సృష్టించి.. ఆపై లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

Step 5: తర్వాత అభ్యర్థి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

Step 6: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించండి.

Step 7: అభ్యర్థులు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

Step 8: చివరిగా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి.. దాని ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

First published:

Tags: Central governmennt, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు