Home /News /jobs /

GOVT JOBS 2022 WALK IN INTERVIEWS AT ICMR NIN SALARY RS 44450 PER MONTH KNOW ELIGIBILITY CRITERIA EVK

Govt Jobs 2022: ఐసీఎంఆర్‌-నిన్‌లో వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు.. వేత‌నం నెలకు రూ.44,450.. అర్హ‌త‌లు ఇవే

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

Govt Jobs 2022 | భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఎటువంటి ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి. వాక్ ఇన్ ఇంర్వ్యూ ఏప్రిల్ 22, 2022 న నిర్వహిస్తారు.

    Wipro Jobs: విప్రో హైదార‌బాద్ లోకేష‌న్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

     పోస్టుల వివరాలు..















    పోస్టుఅర్హతలువేతనంఖాళీలు
    ప్రాజెక్టు స్టాఫ్పోస్టుల‌కు సంబంధించి ఆయా విభాగాల్లో ప‌దోత‌ర‌గ‌తి లేదా పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి నెట్ అర్హ‌త ఉండాలి.పోస్టులను అనుసరించి రూ. 15, 800 నుంచి రూ. 44, 45004

    ఎంపిక విధానం..
    - నోటిఫికేష‌న్ అర్హ‌త ఉన్న అబ్య‌ర్థులు ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు.
    - నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి చెప్పిన తేదీకి వ‌స్తే.. ఇంట‌ర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

     Govt Job Preparation Tips: ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి



    ముఖ్యమైన సమాచారం..

    - అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html లో నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    - ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

    - ఇంట‌ర్వ్యూ అనంత‌రం ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌లు ఒరిజిన‌ల్ చూపించాలి.

    TS Jobs Coaching: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ.. ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ.. వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్

    - ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న‌ట్ట‌యితే.. సంస్థ నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.

    - నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా జీత భ‌త్యాలు ఉంటాయి.

    - ఇంట‌ర్వ్యూ తేదీ ఏప్రిల్ 22, 2022

    - ఇంట‌ర్వ్యూ వేదిక - :
    Conference hall,
    ICMR-NIN,
    Hyderaba, Telangana
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Hyderabad, Interview, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు