Home /News /jobs /

GOVT JOBS 2022 VARIOUS POST TO APPLY THIS WEEK KNOW APPLICATION PROCESS AND ELIGIBILITY DETAILS EVK

Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs 2022 | ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌ఫై దృష్టిపెట్ట‌వ‌చ్చు. ఈ వారం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌లు ప్ర‌భుత్వ ఉద్యోగ ప్ర‌క‌ట‌నల అర్హ‌త‌ల‌ను గ‌మ‌నించుకొని త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ప‌లు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఈ వారంతో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో వాటి అప్లికేష‌న్ విధానం..

    ఎన్‌హెచ్ఎం తెలంగాణ‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు..

    తెలంగాణ రాష్ట్రంలో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ద్వారా ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప‌ని చేయ‌డానికి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అభ్య‌ర్థుల‌ను ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి 12 పోస్టులు ఉన్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.40,000 వేత‌నం అందిస్తారు. ఎటువంటి ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://chfw.telangana.gov.in/home.do ను సంద‌ర్శించాలి. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేదీ మే 20,2022. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకొని ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వండి. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

     బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

    విశాఖ‌ప‌ట్నంలో హెచ్‌పీ కంపెనీలో ఉద్యోగాలు..

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖప‌ట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited)లో పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ విశాఖ రిఫైన‌రి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తుంది. అన్ని విభాగాల్లో క‌లిపి 186 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, అప్లికేష‌న్ విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మే 21, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు