GOVT JOBS 2022 VARIOUS JOB NOTIFICATIONS FROM GOVT KNOW APPLICATION PROCESS AND DETAILS EVK
Govt Jobs 2022: ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం
(ప్రతీకాత్మక చిత్రం)
Govt Jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటి అప్లికేషన్ విధానం..
జూనియర్ లైన్ మెన్ జాబ్స్..
తెలంగాణలో విద్యుత్ శాఖ దక్షిణతెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) నుంచి 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. అప్లై చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్సైట్ https://www.tssouthernpower.com/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్ష ప్యాటర్న్, సెలబస్ వివరాలు తెలుసుకోండి. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
ఐఐటీ హైదరాబాద్లో రీసెర్చ్ ఫెలో జాబ్స్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research fellow), సీనియర్ రీసెర్చ్ ఫెలో (Senior Research fellow), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్లోఈ పోస్టులున్నాయి. ఇవి మూడేళ్ల గడువున్న రీసెర్చ్ ఫెలో పోస్టులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ప్రాజెక్ట్ కోసం, సీనియర్ రీసెర్చ్ ఫెలోను డీఆర్డీఓ ప్రాజెక్ట్ కోసం నియమిస్తోంది ఐఐటీ హైదరాబాద్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మే 27, 2022 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
ఓఎన్జీసీలో 922 జాబ్స్..
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.