GOVT JOBS 2022 TWO TO THREE DAYS CHANCE FOR GOVERNMENT JOBS IN MANY COMPANIES APPLICATION DETAILS EVK
Govt Jobs 2022: పలు సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు రెండు మూడు రోజులే చాన్స్.. అప్లికేషన్ వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
Govt Jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకొనే ప్రభుత్వ ఉద్యోగాలు తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటి అప్లికేషన్ విధానం..
ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 12 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,000 నుంచి రూ.52,000 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి మే 26 , 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
కృష్ణా జిల్లాలో 126 కాంట్రాక్టు ఉద్యోగాలు..
కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం (District Medical and Health Organisation)లో 126 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్డియాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్పెషల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు (Contract) ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ పోస్టుల వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు కొద్ది రోజుల మాత్రమే అవకాశం ఉంది. మే 25, 2022 సాయంత్రం 5 గంటల లోపు ఈ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవలం ఆఫ్లైన్ (Offline) పద్ధతిలో దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఐఐటీ హైదరాబాద్లో రీసెర్చ్ ఫెలో జాబ్స్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research fellow), సీనియర్ రీసెర్చ్ ఫెలో (Senior Research fellow), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్లోఈ పోస్టులున్నాయి. ఇవి మూడేళ్ల గడువున్న రీసెర్చ్ ఫెలో పోస్టులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ప్రాజెక్ట్ కోసం, సీనియర్ రీసెర్చ్ ఫెలోను డీఆర్డీఓ ప్రాజెక్ట్ కోసం నియమిస్తోంది ఐఐటీ హైదరాబాద్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మే 27, 2022 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.