Home /News /jobs /

GOVT JOBS 2022 TOP 5 JOBS YOU NEED TO APPLY FOR THIS WEEK KNOW DETAILS AND APPLICATION PROCESS EVK

Govt Jobs 2022: ఈ వారం మీరు అప్లై చేయాల్సిన టాప్ 5 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. ఈ వారం కొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు చివ‌రి తేది. మ‌రికొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వారం ప‌దిరోజులు చాన్స్ ఉంది. వాటి వివ‌రాలు..

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications) ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. ఈ వారం కొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు చివ‌రి తేది. మ‌రికొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వారం ప‌దిరోజులు చాన్స్ ఉంది. కానీ త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం వ‌ల్ల ప్రిప‌రేష‌న్ మీద దృష్టి పెట్ట‌వ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల్లో నెల్లూరు (Nellore), విజ‌య‌న‌గ‌రం డీఎంహెచ్ఓ (DMHO) ఉద్యోగాల‌కు ఈ వారం ఆఖ‌రు తేది. ఆర్‌బీఐ (RBI), డీఎస్ఎస్‌బీ, ఈఎస్ఐ ఉద్యోగాల‌కు ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు అవ‌కాశం ఉంది. త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకొని ప్రిప‌రేష‌న్ ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు.  ఈ వారం ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నించే.. అభ్య‌ర్థుల‌కు అవ‌స‌రం అయిన టాప్ 5 ఉద్యోగాలు ఇవే. ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

    విజ‌య‌న‌గ‌రం జిల్లా డీఎంహెచ్ఓలో..

    విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో 55 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification)విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

    నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు..

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification)విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జిల్లా ఎపిడిమియాల‌జిస్ట్‌, ఓటీ టెక్నిషియ‌న్‌, డెంట‌ల్ హైజీనిస్ట్‌ పోస్టుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం వాక్ఇన్ ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూ తేదీలు జ‌న‌వ‌రి 20, 2022 నుంచి జ‌న‌వ‌రి 27, 2022 వ‌ర‌కు ఉంటాయి. (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

    ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్..

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ.  (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

    తెలంగాణ‌లో ఉద్యోగాలు..

    ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (Employees' State Insurance Corporation) లో ప‌లు రీజియ‌న్‌లలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ (Notification) విడుదల అయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) రీజియ‌న్‌కు సంబంధించి అప్ర‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌, స్ట‌నోగ్ర‌ఫ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తులు జ‌న‌వ‌రి 15, 2022న ప్రారంభ‌మై ఫిబ్ర‌వ‌రి 15, 2022న ముగుస్తుంది.   (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

    నేష‌న‌ల్ క్యాపిట‌ల్ ఆఫ్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ (  ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) స‌బార్డినేట్ స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డు ( Delhi Subordinate Services Selection Board)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జూనియ‌ర్ ఇంజ‌నీర్ విభాగంలో 691 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి అప్లికేష‌న్ ప్రాసెస్ జ‌న‌వ‌రి 10, 2022 నుంచి ప్రారంభం అవుతుంది  వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ dsssb.delhi.gov.in ను సంద‌ర్శించాలి. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు ఫిబ్ర‌వ‌రి 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Central Government Jobs, Govt Jobs 2022, Rbi, Telangana

    తదుపరి వార్తలు