Home /News /jobs /

GOVT JOBS 2022 THREE DAYS CHANCE TO APPLY FOR VARIOUS GOVERNMENT JOBS KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Govt Jobs 2022: ప‌లు ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే చాన్స్‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు పోస్టుల‌కు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. వాటి వివ‌రాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ప్రభుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌పై దృష్టిపెట్ట‌వ‌చ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప‌లు పోస్టుల‌కు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. వాటి వివ‌రాలు తెలుసుకోండి.

    పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగాలు..

    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.  ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ (Insurance Advisor) విభాగంలో  మొత్తం 300 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఎంపికైనవారు ఎల్ఐసీలో పార్ట్ టైమ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.  అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మార్కెట్ సర్వే, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 31, 2022 వరకు అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు..

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఒంగోలు జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో(GGH) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇందులో పర్ ఫ్యూజనిస్ట్, ఎంఆర్ఐ టెక్నీషిన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, కాథ్ లాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ (Notification)  వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    డిగ్రీ విద్యార్హతతో కాంట్రాక్ట్ జాబ్స్..  

    తెలంగాణ‌లో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేష‌న‌ల్ ఎయిడ్స్ అండ్ ఎస్‌టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోంది.  ఇప్పటికే టీఎస్ఏసీఎస్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఐసీటీసీ కౌన్సిల‌ర్‌, డీఎస్ఆర్‌సీ కౌన్సిల‌ర్‌, ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 60 ఏళ్లుగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక నియ‌మిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://tsacs.telangana.gov.in/ ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, Jobs in telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు