ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications) లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ప్రకారం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్‌ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఈ వారం డిగ్రీ అర్హతతో తెలంగాణలో పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. ఇర్కాన్‌లో పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్‌లను ఈ వారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) ఎన్ఐపీఈఆర్‌లో పలు పోస్టల దరఖాస్తుకు ఈ వారమే చివరి అవకాశం. ఆసక్తి ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.
Govt Jobs 2022: బీఎన్‌పీలో ఉద్యోగాలు.. నెలకు వేతనం రూ. 67, 390 .. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
డిగ్రీ అర్హతతో తెలంగాణలో..
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Cooperative Apex Bank Limited) ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా కో-ఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. సంస్థ జిల్లాల వారీగా వేర్వేరుగా నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా రాష్ట్రంలో మొత్తం 445 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ (Asst. Manager) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్https://tscab.org/dccbs-2/ ను సందర్శించాల్సి ఉంటుంది. (పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఇర్కాన్‌లో 389 ఉద్యోగాలు.. పరీక్ష లేదు..
ఇండియన్ రైల్వేకి చెందిన న్యూఢిల్లీ (Delhi)లోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON International Ltd.) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ద్వారా సీనియర్ వర్క్ ఇంజినీర్లు, వర్క్స్ ఇంజనీర్లు, సైట్ సూపర్ వైజర్లు, జియాలజిస్టు పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం ఉద్యోగాలు 389. ఎటువంటి దరఖాస్తు ప్రక్రియ అవసరం లేదు. నేరుగా ఇంటర్వ్యూ (Interview) కి వెళ్లోచ్చు. నోటిఫికేషన్, అర్హతల సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.ircon.org/index.php?lang=en ను సందర్శించాలి. ఈ పోస్టుల వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు మార్చ్ 8, 11, 12తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. (పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి)
Jobs in Hyderabad: హైదరాబాద్ ఎన్ఎమ్‌డీసీలో ఉద్యోగాలు.. వేతనం రూ. 50,000.. అర్హతలు ఇవే!
హైదరాబాద్ ఎన్ఐపీఈఆర్‌లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (National Institute of Pharmaceutical Education and Research) హైదరాబాద్‌లో ఉంది. ఈ సంస్థలో పలు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయసు 27 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థును స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.niperhyd.ac.in/index.html ను సందర్శించాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 3, 2022 వరకు అవకాశం ఉంది. (పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS