Home /News /jobs /

GOVT JOBS 2022 JOBS WITH ENGINEERING DEGREE SALARY RS 34800 KNOW APPLICATION PROCESS EVK

Govt Jobs 2022: ఇంజ‌నీరింగ్ విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు.. జీతం రూ.34,800.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

DSSSB Recruitment | నేష‌న‌ల్ క్యాపిట‌ల్ ఆఫ్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) స‌బార్డినేట్ స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డు లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇంజ‌నీరింగ్ అర్హ‌త‌తో 691 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు ఫిబ్ర‌వ‌రి 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    నేష‌న‌ల్ క్యాపిట‌ల్ ఆఫ్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ (National Capital Territory of Delhi) ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) స‌బార్డినేట్ స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డు ( Delhi Subordinate Services Selection Board)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జూనియ‌ర్ ఇంజ‌నీర్ విభాగంలో 691 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి అప్లికేష‌న్ ప్రాసెస్ జ‌న‌వ‌రి 10, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలని నోటిఫికేష‌న్‌ (Notification) లో పేర్కొన్నారు. అప్లికేష‌న్ ప్రాసెస్‌, పోస్టుల వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ dsssb.delhi.gov.in ను సంద‌ర్శించాలి. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు ఫిబ్ర‌వ‌రి 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఇంటర్వ్యూలు.. అర్హ‌త‌లు ఇవే!

    పోస్టుల వివ‌రాలు..





















    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువేత‌నం
    జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఎల‌క్ట్రిక‌ల్‌116గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎల‌క్ట్రిక‌ల్ విభాగంలో ఇంజ‌నీరింగ్ లేదా డిప్ల‌మా చేసి ఉండాలి.రూ.. 9300-34800+ గ్రేడ్ పే 4200/-
    జూనియ‌ర్ ఇంజ‌నీర్ సివిల్‌575గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో సివిల్‌ విభాగంలో ఇంజ‌నీరింగ్ లేదా డిప్ల‌మా చేసి ఉండాలి.రూ.. 9300-34800+ గ్రేడ్ పే 4200/

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - మొద‌ట‌గా టైర్‌-1 ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
    - ఉత్తీర్ణులైన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - అనంత‌రం టైర్‌- 2 ప‌రీక్ష నిర్వ‌హించి అభ్య‌ర్థులను ఎంపిక చేస్తారు.

    Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లా డీఎంహెచ్ఓలో 55 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board ను సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం POST CODE 801/22 నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    APPSC Preparation: ఏపీపీఎస్‌సీలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ ప్లాన్‌!

     Step 4 : అర్హ‌త‌లు అన్ని స‌రిగా చూసుకోవాలి.


    Step 5 : నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత అప్లికేష‌న్ కోసం https://dsssbonline.nic.in/ లింక్‌లోకి వెళ్లాలి.

    Step 6 : త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాంను పూరించాలి.

    Step 7 : అనంత‌రం అప్లికేష‌న్ ప్రివ్యూ చూసి త‌ప్పులు లేకుంటే స‌బ్‌మిట్ చేయాలి.

    Step 8 : ఒక ద‌ర‌ఖాస్తు కాపీని ప్రింట్ తీసి దాచుకోవాలి.

    Step 9 : ద‌ర‌ఖాస్తుకు ఫిబ్ర‌వ‌రి 9, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Delhi, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు