Home /News /jobs /

GOVT JOBS 2022 JOBS WITH 10TH CLASS QUALIFICATION IN ECIL KNOW SALARY AND APPLICATION PROCEDURE EVK

Govt Jobs 2022: ఈసీఐఎల్‌లో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs 2022 | హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది.  లైట్ వెహికిల్ డ్రైవర్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

    హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది.  లైట్ వెహికిల్ డ్రైవర్ ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి 04 పోస్టుల దాకా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ట్రెడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుకు జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్   https://careers.ecil.co.in/advt0922.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Internships: ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రూ.10,000ల‌తో కేంద్ర సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

    భర్తీ చేసే పోస్టు పేరు-  లైట్ వెహికిల్ డ్రైవర్

    మొత్తం ఖాళీలు- 04

    దరఖాస్తు ప్రారంభం-  జూన్ 4, 2022

    దరఖాస్తుకు చివరి తేదీ-  జూన్  25, 2022

    పోస్టుల వివరాలు..













    పోస్టుఖాళీలువేతనం
    లైట్ వెహికిల్ డ్రైవర్04రూ. 20,480

    అర్హ‌త‌లు
    దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి పదోతరగతి పాసై ఉండాలి. హెవీ మోటార్ వాహణాల డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభ‌వం ఉండాలి. మోటార్ మెకానిజంపై ప‌రిజ్ఞానం ఉండాలి. .  అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్ల మించ‌కూడ‌దు.



    `ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముందుగా అధికారిక వెబ్‌సైట్   https://careers.ecil.co.in/advt0922.php  లోకి వెళ్లాలి.

    Career and Courses: తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారికి కూడా అవ‌కాశం

    Step 2 - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 3 - త‌రువాత   https://careers.ecil.co.in/login.php లింక్లోకి వెళ్లి.. ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తి చేయాలి.

    Step 4 - ద‌ర‌ఖాస్తు రుస‌ము చెల్లింపు  విండో ఓపెన్ చేసి ఫీజు చెల్లించాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు నింపి భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు