GOVT JOBS 2022 JOBS TO APPLY THIS WEEK KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Govt Jobs 2022: ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్
(ప్రతీకాత్మక చిత్రం)
Govt Jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్‌ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటి అప్లికేషన్ విధానం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
విశాఖపట్నంలో హెచ్‌పీ కంపెనీలో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ విశాఖ రిఫైనరి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తుంది. అన్ని విభాగాల్లో కలిపి 186 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, అప్లికేషన్ విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 21, 2022 వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఓఎన్జీసీలో 922 జాబ్స్..
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.