Home /News /jobs /

GOVT JOBS 2022 JOBS AT CENTRAL UNIVERSITY KNOW SELECTION THROUGH DIRECT INTERVIEW AND QUALIFICATIONS EVK

Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌లు!

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ర్ణాట‌క

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ర్ణాట‌క

Govt Jobs 2022 | క‌ర్ణాట‌క‌ (Karnataka) లోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన క‌ల‌బుర‌గిలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ర్ణాట‌క కింది పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌లు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (Assistant Professor) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    క‌ర్ణాట‌క‌ (Karnataka) లోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన క‌ల‌బుర‌గిలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ర్ణాట‌క కింది పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌లు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (Assistant Professor) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా.. కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారిక వెబ‌సైట్ https://www.cuk.ac.in/#/jobs ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 30, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తు కావ‌డంతో ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీ పంపేందుకు ఏప్రిల్ 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

    పోస్టుల వివ‌రాలు..











    పోస్టు పేరుఅర్హ‌త‌లు
    అసిస్టెంట్ ప్రొఫెస‌ర్పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత సంబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్‌/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త క‌లిగి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం కూడా ఉండాలి.

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

    - ద‌ర‌ఖాస్తు అనంత‌రం అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Jobs in Telangana: డిగ్రీ విద్యార్హతతో కాంట్రాక్ట్ జాబ్స్.. వేతనం, అర్హతలు, అప్లికేషన్ వివరాలు

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.cuk.ac.in/#/jobs ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    Step 3 - అనంత‌రం నోటిఫికేషన్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - త‌రువాత అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేయ‌డానికి https://cukrec.samarth.edu.in/ ఈ లింక్‌లోకి వెళ్లాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాంను నింపాలి.

    Step 6 - అప్లికేష‌న్ పూర్త‌యిన త‌రువాత రూ.2,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల రూ.1,000 ఫీజు చెల్లించాలి.

    Jobs in AP: ఒంగోలులో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ.28,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

    Step 7 - ద‌ర‌ఖాస్తుల‌ను
    The Rigistrar,
    Central university of karnataka,
    kadaganchi, Aland road,
    Kalaburagi District-585367. అడ్ర‌స్‌కు పంపాలి

    Step 8 - ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు కోసం మార్చ్ 30, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Step 9 - హార్డ్ కాపీ ద‌ర‌ఖాస్తులు పంప‌డానికి ఏప్రిల్ 7, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS, Karnataka

    తదుపరి వార్తలు