Home /News /jobs /

GOVT JOBS 2022 JOB OPPORTUNITIES WITH DEGREE ENGINEERING QUALIFICATION SALARY APPLICATION PROCEDURE EVK

Govt jobs 2022: డిగ్రీ, ఇంజ‌నీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం, ద‌ర‌ఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs 2022 | ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. ఈ నేప‌థ్యంలో ముందుగానే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఉత్త‌మం.

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్  ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌ఫై దృష్టిపెట్ట‌వ‌చ్చు.  ఈ నేప‌థ్యంలో ముఖ్యమైన జాబ్స్‌కు సంబంధించిన వాటి అప్లికేష‌న్ విధానం..

    డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్..

    బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. జనరల్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 24 చివరి తేదీ. ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్, మేలో ఇంటర్వ్యూలు ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానంగురించి తెలుసుకోండి.  (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

     ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు

    ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ (ఓటీఏ)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 2022 అక్టోబ‌ర్ సంవ‌త్స‌రానికి 59వ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌) మెన్‌, అంతే కాకుండా 30వ షార్ట్ స‌ర్వీస్ (టెక్‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్‌ను తాజాగా విడుద‌ల చేసింది.



    ఈ పోస్టుల‌ను ఇంజ‌నీరింగ్ చ‌దివిన మ‌హిళ‌లు, పురుషులు అర్హులు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ఆస‌క‌ప‌ద్ధ‌తిలో ఉంటుంది. పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/officers-notifications.htm ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు ఏప్రిల్ 6, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.  (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: IT jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు