GOVT JOBS 2022 GOVERNMENT JOBS TO BE APPLIED FOR THIS WEEK KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK
Govt jobs 2022: ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్!
ప్రతీకాత్మక చిత్రం
Govt jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ వారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటి అప్లికేషన్ విధానం..
ఇండియన్ ఆర్మీలో..
ఇండియన్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2022 అక్టోబర్ సంవత్సరానికి 59వ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, అంతే కాకుండా 30వ షార్ట్ సర్వీస్ (టెక్) ఉమెన్కోర్సు నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను ఇంజనీరింగ్ చదివిన మహిళలు, పురుషులు అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ఆసకపద్ధతిలో ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://joinindianarmy.nic.in/officers-notifications.htm ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 6, 2022 వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
కృష్ణా జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కృష్ణా జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 24 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,000 నుంచి రూ.52,000 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 1, 2022 వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఒంగోలులో ఉద్యోగ అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఒంగోలు జనరల్ ఆస్పత్రిలో(GGH) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇందులో పర్ ఫ్యూజనిస్ట్, ఎంఆర్ఐ టెక్నీషిన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, కాథ్ లాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4, 2022 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ (Notification) వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://prakasam.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
తెలంగాణలో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో..
తెలంగాణలో టీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TS AIDS Control Society) నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రొగ్రాం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పటికే టీఎస్ఏసీఎస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐసీటీసీ కౌన్సిలర్, డీఎస్ఆర్సీ కౌన్సిలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 60 ఏళ్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ https://tsacs.telangana.gov.in/ ను సందర్శించాలి. దరఖాస్తుకు మార్చ్ 31, 2022 వరకు అవకాశం ఉంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.