Home /News /jobs /

GOVT JOBS 2022 GOVERNMENT JOBS TO APPLY THIS WEEK KNOW ELIGIBILITY AND SALARY DETAILS EVK

Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, వేత‌నం వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్ ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తి చేస్తే మంచింది.

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్  ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌ఫై దృష్టిపెట్ట‌వ‌చ్చు. ఈ వారం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌లు ప్ర‌భుత్వ ఉద్యోగ ప్ర‌క‌ట‌నల అర్హ‌త‌ల‌ను గ‌మ‌నించుకొని త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి.   ప‌లు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఈ వారంతో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో వాటి అప్లికేష‌న్ విధానం..

    క‌ర్నూలు జిల్లాలో 70 కాంట్రాక్టు ఉద్యోగాలు..

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)క‌ర్నూలు జిల్లాలో జిల్లా వైద్య‌శాఖ కార్యాల‌యంలో ప‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ (Specilist Doctors) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు ఈ పోస్టుల‌కు సంబంధించిన అర్హ‌త‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌లో పొందు ప‌రిచారు. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు స‌మాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అన్ని విభాగాల్లో క‌లిపి 70 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    డిగ్రీ అర్హత, రూ.50,000 వేత‌నం..

    భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ (National Mineral Development Corporation) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ మొద‌లైంది. ఈ సంస్థ ప్ర‌ధాన కేంద్రం హైద‌రాబాద్‌లోనే ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 22 ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (ప‌ర్స‌న‌ల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియపూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు సందేహాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://jobapply.in/NMDC2022ugcnet/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 17, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)

    హైద‌రాబాద్ ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు..

    హైద‌రాబాద్ (Hyderabad)రాజేంద్ర న‌గ‌ర్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధికి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ (National Institute of Rural Development and Panchayati Raj)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఉద్యోగాల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తున్న‌ట్టు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. పోస్టుల ఆధారంగా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడదు. నోటిఫికేష‌న్ (Notification) స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ http://nirdpr.org.in/index.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 27, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  (మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Hyderabad, Job notification, JOBS, Jobs in telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు