Home /News /jobs /

GOVT JOBS 2022 GOVERNMENT JOBS TO APPLY THIS WEEK APPLICATION PROCESS EVK

Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Govt Jobs 2022 | ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది.

ఇంకా చదవండి ...
    ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప్ర‌య‌త్నం చేసే అభ్య‌ర్థులు.. జాబ్ అప్లికేష‌న్‌ (Job Applications)ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివ‌రి నిమిషంలో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు క‌ష్టం అవ్వొచ్చు. కావున వారం ప‌ది రోజుల ముందే నోటిఫికేష‌న్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిప‌రేష‌న్‌ఫై దృష్టిపెట్ట‌వ‌చ్చు. ఈ వారం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌లు ప్ర‌భుత్వ ఉద్యోగ ప్ర‌క‌ట‌నల అర్హ‌త‌ల‌ను గ‌మ‌నించుకొని త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ప‌లు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఈ వారంతో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో వాటి అప్లికేష‌న్ విధానం..

    మెట్రో రైల్ లో రూ.లక్ష వేతనంతో జాబ్స్..

    నిరుద్యోగులకు ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్ తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

    ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థలో..

    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ సినియ‌ర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్టు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి. వాక్ ఇన్‌ల‌ను.. 25-26 ఏప్రిల్ 2022 న నిర్వ‌హిస్తారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)

    సింగ‌రేణి కొల‌రీస్‌లో ఉద్యోగాలు..

    భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్త‌గూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా వివిధ పోస్టుల‌ను ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఇంట‌ర్వ్యూకు హాజ‌రయ్యే అర్హులైన అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడదు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల స‌మాచారం, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికార‌కి వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు